Rites Limited Jobs: డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్ గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) కాంట్రాక్ట్ విధానంలో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 5
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రెసిడెంట్ ఇంజినీర్(సివిల్), రెసిడెంట్ ఇంజినీర్(మెకానికల్), రెసిడెంట్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
రెసిడెంట్ ఇంజనీర్ (సివిల్)- 2
రెసిడెంట్ ఇంజినీర్ (మెకానికల్)- 2
రెసిడెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 1
విద్యార్హత: సివిల్, మెకానికల్, ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మెకానికల్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అఅండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 40 ఏళ్లు దాటరాదు.
బేసిక్ పే: 16,828
దరఖాస్తు ఫీజు: 600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది.)
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 14.
రాత పరీక్ష తేది: జనవరి 19.
పరీక్ష కేంద్రం: ఢిల్లీ, గుడ్ గావ్, కలకత్తా