BigTV English

Atlee : వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో బెంగుళూరు జట్టును కొన్న అట్లీ… సమంత ఏ జట్టుకు యాజమానో తెలుసా ?

Atlee : వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో బెంగుళూరు జట్టును కొన్న అట్లీ… సమంత ఏ జట్టుకు యాజమానో తెలుసా ?

Atlee : స్పోర్ట్స్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ గేమ్ వరల్డ్ పికిల్ బాల్ లీగ్ (World Pickleball League) ఈ ఏడాది మొదలు కాబోతోంది. అయితే ఈ టోర్నమెంట్లో సౌత్ సెలబ్రిటీల సందడి ఎక్కువైంది. ఇప్పటికే స్విగ్గితో పాటు సమంత (Samantha) కూడా ఈ గేమ్ లో పలు జట్లకు యజమానులుగా మారగా, తాజాగా సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) మరో టీంని కొనుగోలు చేశారు. ఆయన యజమానిగా మారిన జట్టు పేరు కూడా ఆల్మోస్ట్ తన బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’కు దగ్గరగా ఉండడం విశేషం.


వరల్డ్ పికిల్ బాల్ లీగ్ జనవరి 24 నుంచి స్టార్ట్ కాబోతోంది. భారత మాజీ టెన్నిస్ ప్లేయర్లు గౌరవ్ నటేకర్, ఆరతి పొన్నప్ప నటేకర్ కో ఫౌండర్స్ గా ఉన్న ఈ లీగ్ లో దాదాపు 48 మంది ఇండియన్ ప్లేయర్లు ఆరు ఫ్రాంచైజీ ల కోసం ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ‘బెంగుళూరు జవాన్స్’ (Bengaluru Jawans) అనే టీంని కొనుగోలు చేశారు. అట్లీతో పాటు ఆయన భార్య కూడా ఈ చెట్టుకు ఈ యజమానిగా ఉండడం విశేషం. ఇక 2023లో అట్లీ చేసిన ‘జవాన్’ మూవీ దాదాపు 1000 కోట్లు కొల్లగొట్టి, హిందీలో బిగ్గెస్ట్ మూవీగా చరిత్ర సృష్టించిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన కొన్న జట్టు పేరులో కూడా ‘జవాన్’ అని ఉండడం యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ, నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక బెంగుళూరు జవాన్ల జట్టులో భారత పికిల్‌బాల్ సెన్సేషన్ వృశాలి థాకరేతో తో పాటు అద్భుతంగా ఆడగల సత్తా ఉన్న టీం ఉంది. మార్సెలో జార్డిమ్, అలెజాండ్రా బొబారియా, ఫెలిక్స్ గ్రునెర్ట్, జాక్ ఫోస్టర్, కాటెరినా స్టీవర్ట్, ట్రాంగ్ హ్యూన్ మెక్‌క్లెయిన్, మౌరో గార్సియాతో కలిసి బెంగుళూరు జవాన్స్ టీంను గెలిపించే దిశగా ఆడబోతున్నారు.


ఇదిలా ఉండగా గత నవంబర్లో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గి పికిల్ బాల్ లీగ్ లో ముంబై జట్టును కొన్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది. ఇక అంతకు ముందే సౌత్ క్వీన్ సమంత చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పుడేమో తాజాగా అట్లీ ఈ లిస్టులో చేరారు. ఇక ఇండియాలో దాదాపు లక్ష కంటే ఎక్కువ మంది పికిల్ బాల్ క్రీడాకారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో దాదాపు 400 నుంచి 500 మంది ప్రొఫెషనల్ ప్లేయర్లు ఉండగా, రోజు రోజుకూ ఈ గేమ్ కి మంచి ఆదరణ పెరుగుతుంది.

ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ’ అనే హిందీ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ విషయానికి వస్తే… ‘జవాన్’ సినిమాని తీసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆయన ఇంకా తన నెక్స్ట్ మూవీ గురించి వెల్లడించలేదు. కానీ ‘బేబీ జాన్’ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ నెక్స్ట్ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో, దేశం గర్వించదగినదిగా ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అట్లీ – సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో మూవీ రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×