BigTV English

Throat Infection: చలికాలంలో గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి

Throat Infection: చలికాలంలో గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి

Throat Infection: చలికాలంలో వాతావరణం మారుతున్న కొద్దీ జలుబు, దగ్గు, గొంతునొప్పి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పొగమంచుతో పాటు పెరుగుతున్న కాలుష్యం వ్యక్తి యొక్క గొంతును పొడిగా మార్చడంతో పాటు చికాకును కూడా కలిగిస్తుంది.


పెరుగుతున్న కాలుష్యం కారణంగా నిరంతరం క్షీణిస్తున్న గాలి నాణ్యత శ్వాస, కీళ్ళు , గొంతుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. అయితే, దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటి సబమస్యలు ప్రతి సంవత్సరం వాతావరణం మారినప్పుడు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాతావరణంలో కలిగే మార్పు కారణంగా మీరు గొంతు నొప్పితో కూడా ఇబ్బంది పడుతుంటే.. మాత్రం కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.

చలికాలంలో మీ గొంతును శుభ్రంగా ఉంచుకోవడానికి 5 చిట్కాలు తెలుసుకోండి.


చలికాలంలో గొంతు నొప్పిని నివారించడానికి, ఈ 5 హోం రెమెడీస్ తప్పకుండా పాటించండి. ఇవి చాలా ప్రభావవంతగా పనిచేస్తాయి. చలికాలంలో తరుచుగా వచ్చే దగ్గు, జలుబు , గొంతునొప్పి వంటివి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని వస్తుంటాయి. మీరు కూడా గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే గనక మీకు ఈ చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.

ఈ చిట్కాలు గొంతు నొప్పి నుండి ఉపశమనం ఇస్తాయి:

ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం:
ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల దుమ్ము, ఇతర అలెర్జీ కారకాలను ఫిల్టర్ చేస్తుంది. దీని కారణంగా పీల్చే గాలి సహజంగా శుభ్రంగా , తేమగా మారుతుంది. దీనికి విరుద్ధంగా, నోటి నుంచి శ్వాస వల్ల నోరు పొడిబారుతుంది. ఫలితంగా గొంతు నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

ఆవిరి ఉపయోగించండి:
పొడి, చల్లని గాలిని పీల్చడం వల్ల స్వర కణజాలం పొడిబారుతుంది. అటువంటి పరిస్థితిలో, స్టీమర్ ఉపయోగించి ఆవిరిని తీసుకోవడం వల్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

హైడ్రేటెడ్ గా ఉండండి:
గొంతు నొప్పిని నయం చేయడానికి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం, మీరు మీ ఆహారంలో అనేక రకాల ఆరోగ్యకరమైన డ్రింక్స్ చేర్చుకోండి. ఇది మీ గొంతులో తేమను తగ్గించడం ద్వారా దగ్గు వల్ల కలిగే చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందు కోసం మీరు హెర్బల్ టీతో పాటు లైకోరైస్ టీ, వేడినీరు , తేనెను త్రాగవచ్చు. లైకోరైస్ రూట్ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడే ప్రభావవంతమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌ను కలిగి ఉంటుంది. ఈ డ్రింక్ గొంతు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

Also Read: జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే.. సమస్య దూరం

మస్క్ ధరించండి:
కాలుష్యం వల్ల కలిగే గొంతు నొప్పిని నివారించడానికి N95 వంటి నాణ్యమైన మాస్క్‌లు ధరించాలి. ఈ మాస్క్‌లు ఫిల్టర్‌లతో వస్తాయి. అంతే కాకుండా కాలుష్యం నుండి రక్షించడంలో కూడా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది వ్యక్తి యొక్క శ్వాసకోశ వ్యవస్థతో పాటు గొంతును హానికరమైన కాలుష్యం నుండి కాపాడుతుంది.

అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్లండి:

కాలుష్యం కారణంగా గొంతు నొప్పిని నివారించడానికి, అవసరమైనప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. పొగమంచు సాయంత్రం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా, ధూమపానం, మద్యం , మసాలా ఆహారాన్ని కూడా నివారించండి. ఇవన్నీ మీ గొంతు నొప్పిని మరింత పెంచుతాయి.

Related News

Healthy Heart: 102 సంవత్సరాల లేటు వయసులో బలమైన గుండె.. ఆ వృద్ధుడి సీక్రెట్ ఏంటో తేల్చేసిన వైద్యులు!

Dum Aloo Masala: రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ ఆలూ మసాలా.. ఇలా చేస్తే అద్భుతమైన రుచి !

Turmeric: పసుపుతో మ్యాజిక్ .. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనాలు !

Tips For Red Lips: పెదాలు ఎరుపు రంగులోకి మారాలా ? ఈ టిప్స్ మీ కోసమే !

Warm Milk: రాత్రి పూట గోరు వెచ్చని పాలు తాగితే.. మతిపోయే లాభాలు !

Health oil tips: ఆహారంలో ఈ నూనెలు వాడటం మానేయండి? లేదంటే ప్రమాదమే!

High Blood Pressure: కంటి సమస్యలా ? మీకు.. హైబీపీ కావొచ్చు !

Dandruff Tips: కేవలం వారం రోజులు చాలు.. చుండ్రు లేకుండా మెరిసే జుట్టు రహస్యం..

Big Stories

×