Tips For Hair Growth: అమ్మాయిల విషయానికి వస్తే, ప్రతి అమ్మాయి తన జుట్టు త్వరగా పొడవుగా పెరగాలని కోరుకుంటుంది. ఇందుకోసం అనేక పద్ధతులు ,ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభిస్తారు. హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల తాత్కాలికంగా లాభాలు ఉన్నప్పటికీ, తర్వాత మామూలై పోతుంది. జుట్టు వేగంగా పెరగాలని లేదా రెట్టింపు వేగంతో పెరగాలని కోరుకునే వారికి కొన్ని రకాల టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని అనుసరించడం ద్వారా మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. మరి ఈ చిట్కాల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
సమతుల్య ఆహారం:
మీరు మీ జుట్టు వేగంగా పెరగాలంటే..తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. జింక్, బయోటిన్, విటమిన్ ఎ, సి, డి వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవన్నీ మీ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి.
మీ జుట్టు వేగంగా పెరగాలని మీరు కోరుకుంటే,తలకు రోజు నూనెతో మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ జుట్టు మూలాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మసాజ్ కోసం మీరు రోజ్మేరీ ఆయిల్, పిప్పరమెంటు నూనెను ఉపయోగించాలి.
హెయిర్ డ్రయర్స్ వాడకం:
మీరు మీ జుట్టును వేగంగా పెంచుకోవాలనుకుంటే, ఖచ్చితంగా హెయిర్ డ్రయర్స్ ఉపయోగించకుండా ఉండాలి. మీరు వీటిని ఉపయోగించినప్పుడు మీ జుట్టు చిట్లిపోతుంది. అంతే కాకుండా మీరు హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటే, ముందుగా ప్రొటెక్టెంట్ తప్పకుండా వాడాలి.
జుట్టును కత్తిరించండి:
జుట్టు వేగంగా పెరగడానికి, మీరు వాటిని క్రమం తప్పకుండా కత్తిరించడం చాలా ముఖ్యం. మీరు ప్రతి 6 నుండి 8 వారాలకు మీ జుట్టును కత్తిరించుకోవాలి. ఇలా చేస్తే మీ జుట్టు చివర్లు చీలిపోయే సమస్య ఉండదు.
Also Read: రోజు 30 నిమిషాలు నడిస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
హైడ్రేటెడ్ గా ఉండండి:
జుట్టు పొడవుగా లేదా వేగంగా పెరగడానికి హైడ్రేషన్ చాలా సహాయపడుతుంది. మీరు తగినంత నీరు త్రాగినప్పుడు మాత్రమే మీ జుట్టు లోపల నుండి హైడ్రేట్ గా ఉంటుంది. సరైన మొత్తంలో నీటిని తాగడం ద్వారా, అవి ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. విరిగిపోయే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
బయట మార్కెట్ లో దొరికే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కాకుండా నేచురల్ గా హెయిర్ ఆయిల్స్ తో పాటు షాంపూలను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మంచి హెయిర్ కేర్ తో పాటు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నేచురల్ ప్రొడక్ట్స్ జుట్టును వేగంగా పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా నివారిస్తాయి. జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు నేచురల్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.