BigTV English

Varun Tej : వరుణ్ తేజ్‌కు షాక్ ఇచ్చిన నిర్మాతలు… చిక్కుల్లో వరుణ్ కొత్త మూవీ?

Varun Tej : వరుణ్ తేజ్‌కు షాక్ ఇచ్చిన నిర్మాతలు… చిక్కుల్లో వరుణ్ కొత్త మూవీ?

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కి అసలు ఈమధ్య టైం ఏ మాత్రం బాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమాలు చేస్తున్నప్పటికీ, ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ పడట్లేదు. పైగా తాజాగా ఆయన కొత్త సినిమాకు సమస్యలు ఎదురైనట్టుగా ఇండస్ట్రీలో ఓ వార్త సర్కులేట్ అవుతోంది.


మెగా కాంపౌండ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోలలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. కానీ గత కొన్నేళ్ళ నుంచి ఆయనకి సరైన హిట్ పడట్లేదు. రీసెంట్ గా ‘మట్కా’ అనే మూవీతో పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు వరుణ్. కానీ ఈ సినిమా కూడా రీసెంట్ టైమ్స్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన సినిమాల లిస్ట్ లో చేరింది. దీంతో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాడు.

అందులో భాగంగానే డైరెక్టర్ మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ (Varun Tej) చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాను ముందుగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందంచాలని అనుకున్నారట. కానీ తాజాగా ‘మట్కా’ ఎఫెక్ట్ తో ఈ ప్రాజెక్టు నుంచి యూవీ క్రియేషన్స్ తప్పుకున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి యూవి క్రియేషన్స్ సైలెంట్ గా సైడ్ అయిపోవడంతో, ఓ ప్రముఖ దర్శకుడు తన హోమ్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని అంటున్నారు.


నిజానికి వరుణ్ తేజ్ (Varun Tej) స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ఎలాగైనా సరే సెట్స్ పైకి తీసుకెళ్లి, వరుణ్ తేజ్ కి హిట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట ఆ డైరెక్టర్. మరి వరుణ్ తేజ్ సినిమాను నిర్మించబోతున్న ఆ డైరెక్టర్ ఎవరు? ఈ సినిమాతో నైనా వరుణ్ కి హిట్ పడుతుందా ? అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

ఇక మేర్లపాక గాంధీ విషయానికి వస్తే… ఆయన 2013లో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ అనే బ్లాక్ బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీ లోకి ఆయన అడుగుపెట్టి చాలా కాలమే అవుతున్నప్పటికీ చేసింది మాత్రం చాలా తక్కువ సినిమాలు. అందులో చెప్పుకోదగ్గవి ఎక్స్ ప్రెస్ రాజా, మాస్ట్రో మాత్రమే. ఇక మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి, నెల కూడా కాకుండానే ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. నవంబర్ 14న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘మట్కా’ మూవీని ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా చూడొచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×