Best Gaming Phones Under 30K : మీరు గేమింగ్ లవర్సా? గెన్షిన్ ఇంపాక్ట్, మొబైల్ లెజెండ్స్ : బ్యాంగ్ బ్యాంగ్, జెన్‌లెస్ జీరో వంటి గేమ్స్‌ను ఎక్కువగా ఆడుతుంటారా? అయితే మీ కోసం బెస్ట్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లోనే ఏకంగా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ ఇచ్చే పెర్ఫామెన్స్‌తో ఫోన్ల వివరాలను తీసుకొచ్చాం. అది కూడా కేవలం ప్రీమియం లుక్‌లో. రూ.30,000 కన్నా తక్కువకే. అవును మీరు చదువుతోంది నిజమే. ఇంతకీ ఆ ఫోన్లు ఏంటో తెలుసుకుందాం.
1.Poco F6 – ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండానే బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం ఎదరుచూస్తున్నారా? అయితే పోకో ఎఫ్ 6 బెస్ట్ ఛాయిస్. స్మాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్సెట్తో నడుస్తుంది. ప్రీమియమ్ లుక్‌తో వచ్చింది. రూ. 40 వేల వరకే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు ఉండే 6.67 ఇంచ్ 120Hz అమోలెడ్ స్క్రీన్ గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడటానికి బాగా ఉపయోగపడుతుంది.
హైపర్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 14తో నడుస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్. డ్యూయెల్ కెమెరా సెటప్. 50 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్ లెన్స్ ఉంటాయి. మంచి కెమెరా క్వాలిటీ వస్తుంది. అదే 8GB RAM and 256GB వేరియంట్ తీసుకుంటే రూ.24,999కే లభిస్తుంది.
2.Motorola Edge 50 – ఎక్కువ ఖర్చు పెట్టకుండానే, టాప్ మోస్ట్ అండ్ డిమాండ్ ఉండే గేమ్స్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మోటోరొలా ఎడ్జ్ 50 బెస్ట్ ఆప్షన్. ఎటువంటి డౌట్ అక్కర్లేదు. సాలిడ్ గేమింగ్ ఫోన్ ఇది. Snapdragon 7 Gen 1 AE ఎడిషన్‌తో నడుస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటె7న్‌తో 6.7-అంగుళాల 120Hz P-OLED స్క్రీన్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ గెన్షిన్ ఇంపాక్ట్, గరేనా ఫ్రీ ఫైర్, బీజీఎమ్ఐ సహా ఇతర గేమ్‌లను బాగా సపోర్ట్ చేస్తుంది. ఐదేళ్ల వరకు OS అప్‌డేట్‌లను ఇస్తుంది.
వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 13MP అల్ట్రావైడ్ షూటర్‌ను అమర్చారు. 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,999కే కొనుగోలు చేయవచ్చు.
3.Samsung Galaxy S23 FE – శాంసంగ్ ఫోన్లలో గేమ్స్ ఆడాలనుకుంటే Galaxy S23 FE బాగా ఉపయోగపడుతుంది. Exynos 2200 చిప్సెట్ ఉంటుంది.
డస్ట్ , వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13తో నడుస్తుంది. నాలుగు ప్రధాన OS అప్‌డేట్‌లను అందిస్తుంది. లేటెస్ట్ గేమ్స్‌ను మంచి గ్రాఫిక్స్, ఫ్రేమ్ రేట్స్‌లో ఎటువంటి సమస్య లేకుండా ఆడొచ్చు.
50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP టెలిఫోటో లెన్స్‌ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ పోన్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వేసవికాలంలో ఫోన్ హీటింగ్ ఎక్కువ అవుతుంది. ఇది 25Wకు సపోర్ట్ చేసేలా 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అందుకే హెవీ గేమర్స్‌కు ఈ ఫోన్ ఎక్కువగా పనికిరాదు. సింపుల్ గేమర్స్‌కు అయితే ఓకే. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30,999కి దొరుకుతోంది. కార్డ్ డిస్కౌంట్స్ ద్వారా రూ. 30,000 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
ఇంకా Realme GT 6T, Vivo T3 Ultra కూడా గేమర్స్‌కు మంచిగానే ఉపయోగపడుతుంది. అమెజాన్‌లో Realme GT 6Tరూ.30,998కే అందుటాబులో ఉంది. అయితే రూ.26వేలకే కొనుగోలు చేసేలా ఆఫర్లు ఉన్నాయి. Vivo T3 Ultra ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
ALSO READ : HP ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ అదిరే డిస్కౌంట్స్.. ఎక్కడంటే!