Homemade Face Serum: చాలా మంది మహిళలు తమ ముఖం అందంగా కనిపించడానికి లేదా ముఖంపై ఉన్న మొటిమలను వదిలించుకోవడానికి రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్‌లను ఉపయోగిస్తారు. దీని కారణంగా, ముఖం అందంగా కనిపించడం మాట పక్కన పెడితే అధ్వాన్నంగా మారుతుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్, సీరంలను తయారు చేసుకుని వాడవచ్చు. వీటి ద్వారా ముఖం అందంగా మెరిసిపోతుంది. అంతే కాకుండా మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. మరి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఫేస్ సీరం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కలబంద ఫేస్ సీరం:
అలోవెరా చర్మానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు కలబందలో పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి పోషణనిస్తుంది అంతేకాకుండా జిడ్డును తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
ఎలా తయారు చేయాలి ?
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోండి. దానికి 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలపండి. ఇప్పుడు దానికి 1 టీస్పూన్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేయండి. తర్వాత వీటన్నింటినీ బాగా కలపండి. దీనిని ఒక చిన్న గాజు సీసాలో స్టోర్ చేసుకోండి.
ఎప్పుడు ఉపయోగించాలి ?
రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఆరిన తర్వాత ఈ సీరమ్‌ను ఫేస్‌పై అప్లై చేయండి. ఆ తర్వాత ముఖాన్ని మసాజ్ చేయండి. ఈ సీరమ్ మీ ముఖంపై కొత్త మెరుపును తీసుకువస్తుంది. అలాగే ఇందులో ఉండే కలబంద చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ సీరం తరుచుగా వాడటం వల్ల ముఖంపై ఉండే మచ్చలు కూడా తొలగిపోతాయి.
Also Read: వీటితో గ్లోయింగ్ స్కిన్ పక్కా !
2. రోజ్ వాటర్ ఫేస్ సీరం:
మీ చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటే కనక రోజ్ వాటర్, గ్లిజరిన్ తో తయారు చేసిన సీరమ్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా మృదువుగా మారుస్తుంది. రోజ్ వాటర్ చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులో వాడే గ్లిజరిన్ చర్మాన్ని చాలా కాలం పాటు హైడ్రేట్‌గా ఉంచుతుంది. ముఖాన్ని కాంతి వంతంగా మారుస్తుంది. ఈ సీరం తరుచుగా ఉపయోగించడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
ఎలా తయారు చేయాలి ?
ఒక బౌల్ లో 2 స్పూన్ల రోజ్ వాటర్ తీసుకోండి. అందులోనే 1 టీస్పూన్ గ్లిజరిన్ , 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపి శుభ్రమైన సీసాలో నిల్వ చేయండి. దీనిని రోజుకు రెండు సార్లు ఉదయం రాత్రి ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ముఖంపై ఉండే మచ్చలు ఈ సీరంతో తొలగిపోతాయి. అంతే కాకుండా మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)