Skin Care Tips: వయసు పెరిగే కొద్దీ చాలా మంది ముఖంపై మచ్చలు రావడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఇది కొన్ని వ్యాధుల వల్ల కూడా జరుగుతుంది. ఏదైనా చర్మవ్యాధి వచ్చినా కూడా ముఖంపై మచ్చలు మొదలవుతాయి. ఈ మచ్చలు మీ అందాన్ని పాడు చేస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
పసుపు, పెరుగు, బంగాళదుంపలు వంటి పదార్థాలు ఇంట్లోనే లభిస్తాయి. వీటిలో ఉండే గుణాలు ముఖంలోని మచ్చలను తొలగించడానికి పని చేస్తాయి. ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని టిప్స్ పాటించడం వల్ల ముఖంపై మచ్చలను తగ్గించుకోవచ్చు.
ముఖంపై మచ్చలను తొలగించడానికి ఇంటి చిట్కాలు
పసుపు: పసుపులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
నిమ్మరసం: నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
చిట్కా:
పెరుగు- 1 టీస్పూన్
నిమ్మరసం- 1/2 టీస్పూన్
పసుపు పొడి – 1 టీస్పూన్
పై 3 పదార్థాలను పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. తరుచుగా పేస్ట్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ముఖంపై మచ్చలు కూడా తగ్గుతాయి.