YCP Leader Ambati hits out at TDP: రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవడానికి వరదలను ఉపయోగించుకోవడం దురదృష్టకరం. పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. నంబూరి శంకర్రావు వరద ప్రాంతాల్లో వెళ్తే టీడీపీ కార్యకర్తలు ఆయన కారుపై దాడులు చేశారు. రెడ్ బుక్ పాలన అంటే ఇదే కదా..? ఇరిగేషన్ మినిస్టర్ చేసే గండ్లు పూడ్చడమా?’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు.
Also Read: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడి
‘బుడమేరు, విజయవ సంక్షోభంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వైసీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారు. ఇంది ఎంతవరకు కరెక్ట్? ప్రకాశం బ్యారేజీలో మూడు పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చిన బోట్లు.. టూరిజం బోట్లు. బోట్లు తెగిపోతే వైసీపీ పార్టీకి ఏం సంబంధం?
కోమటి రామ్మోహన్, ఉషాద్రి టీడీపీ నేతలకు సన్నిహితులు. ఉషాద్రి లోకేశ్ తో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. అక్రమ కేసులతో హింసించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. జగన్ అంటే చంద్రబాబుకు అంత భయమెందుకు? జగన్ వెంట ఉన్న 40 శాతం ఓట్లు అంటే భయం. అందుకే వైసీపీ నేతలకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు.
వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవడానికి వరదలను వినియోగించుకోవడం దురదృష్టకరం. పడవలకు రంగు ఉంటే అవి వైసీపీ బోట్లు అవుతాయా? బుడమేరు, విజయవాడ వరదలకు ఎంతోమంది దుర్మరణం చెందారు. రాష్ట్రంలో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. అసలు ఇంతకు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి. ఇది రెడ్ బుక్ పాలన కాదా? నంబూరి శంకర్ రావు వరద ప్రాంతాలకు వెళ్తే టీడీపీ కార్యకర్తలు కార్లు పగలకొట్టారు. దాడులను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది. పోలీసులకు రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ లేదు’ అంటూ వైసీపీ నేత అంబటి ఎప్పుడూ లేనంతగా సీరియస్ అయ్యారు.
Also Read: తాడేపల్లికి జగన్.. బోట్ల ఘటనపై కౌంటర్ ప్లాన్.. ఆ తర్వాతే ఫారెన్ టూర్?
ఇదిలా ఉంటే.. ఏపీలోని పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, ఆయనతోపాటు పలువురు వైసీపీ నేతలు బయలుదేరివెళ్లారు. అయితే, వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవాలని ఆ నియోజకవర్గం టీడీపీ నేతలు పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో శంకర్ రావు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకనే ప్రయత్నం చేశారు. కారును వేగంగా పోనివ్వడంతో కర్రలతో ఆయన వాహనంపై దాడులు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో శంకర్ రావు కారు డ్యామేజ్ అయ్యింది.
వైసీపీ నాయకుల వాహనంపై టీడీపీ దాడి
పల్నాడు జిల్లా అమరావతి మండలంలో ముంపు ప్రాంతాల పర్యటనకు సిద్ధమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు.
వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన టీడీపీ.. శంకరరావు వాహనాలపై దాడి చేసిన టీడీపీ శ్రేణులు.@JaiTDP @ncbn @YSRCParty… pic.twitter.com/JiwE0sOGk0
— BIG TV Breaking News (@bigtvtelugu) September 10, 2024