BigTV English

Vijay The Goat: ది గోట్ మూవీలో విజయ్ ప్లేస్ లో ముందుగా నటించాల్సింది వీళ్లే

Vijay The Goat: ది గోట్ మూవీలో విజయ్ ప్లేస్ లో ముందుగా నటించాల్సింది వీళ్లే

The Goat was initially written for Dhanush and Rajinikanth and was to be titled ‘Gandhi’.. reveals Venkat Prabhu: భారీ అంచనాలతో ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది హీరో విజయ్ దళపతి నటించిన ది గోట్. తెలుగులో ఈ మూవీని మైత్రీ నిర్మాణ సంస్థ విడుదల చేస్తోంది. అయితే ఈ మూవీని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు మేకర్స్. కనీసం రూ.500 కోట్లు వస్తేనే ఈ మూవీ బయ్యర్స్ లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. విజయ్ తండ్రీకొడుకులుగా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. గుంటూరు కారం సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా కూడా కీలక పాత్రలు పోషించారు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రంగా, పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.


విజయ్ చివరి సినిమాగా ప్రచారం

తమిళనాట విజయ్ దళపతి రాజకీయాలలో వెళ్లిపోతున్న నేపథ్యంలో దాదాపు ఇదే విజయ్ నటించిన ఆఖరి చిత్రంగా ప్రచారం జరుగుతోంది. దీనితో విజయ్ వీరాభిమానులంతా ఈ సినిమాకు ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో ఆన్ లైన్ లో అడ్డాన్స్ బుకింగ్స్ టిక్కెట్స్ కొనుగోలు చేశారు.ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం క్రియేట్ చేస్తోంది. తొలి రోజే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా. అయితే సాధారణంగా విజయ్ సినిమాలలో తప్పనిసరిగా కేంద్రాన్ని విమర్శిస్తూనో లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పొలిటికల్ సెటైర్ డైలాగులు ఉంటాయి. టాలీవుడ్ లోనూ బాలకృష్ణ మూవీలో ఇలాంటి డైలాగులే అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. అయితే దర్శకుడు వెంకట్ ప్రభు ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాదు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో గ్రాఫిక్స్ తో నిర్మించిన సాంకేతిక సైంటిఫిక్ మూవీ అన్నారు.


రజనీకాంత్, ధనుష్

ఈ మూవీకి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మంచి ట్యూన్స్ ఇవ్వడమే కాక..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుత రీతిలో ఇచ్చారు రీసెంట్ గా రిలీజయిన మస్తీ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు అసలు ది గోట్ మూవీని విజయ్ దళపతిని అనుకోలేదు. ముందుగా తన మైండ్ లో వారిద్దరినీ దృష్టిలో పెట్టుకుని సినిమా చేశానని అన్నారు. వాళ్లెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్..వీళ్లిద్దరు బయట ప్రపంచానికి మామా అల్లుళ్టు అని తెలుసు. కానీ వీరిని ది గోట్ మూవీలో తండ్రీ కొడుకులుగా చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగిందట. ఈ ప్రాజెక్టుకు ముందుగా ఇద్దరూ కథ విని ఓకే చేశారు. టైటిల్ కూడా గాంధీ అని అనుకున్నారట.అయితే కొన్ని కారణాల వలన ధనుష్ రజనీ కాంత్ కుమార్తెతో విడిపోవడం జరిగింది. దీనితో ఇక ఈ ప్రాెక్టుకు విజయ్ ని సంప్రదిండం..ఆయన ఓకే అనడం జరిగిపోయాయి. తండ్రీ కొడుకులుగా విజయ్ దళపతి నటిస్తేనే బాగుంటుందని చర్చించి చివరకు ఆయననే ఓకే చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఒక వేళ ముందుగా అనుకున్నట్లు రజనీ, ధనుష్ కాంబో సెట్ అయివుంటే ఈ మూవీపై అంచనాలు మరింత డబుల్ గా ఉండేవంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×