BigTV English

Cholesterol Control Tips: కొలెస్ట్రాల్‌ను ఇలా కంట్రోల్ చేయండి..!

Cholesterol Control Tips: కొలెస్ట్రాల్‌ను ఇలా కంట్రోల్ చేయండి..!
Cholesterol Control Tips

Cholesterol Control Tips (health tips in telugu):


మ‌న శ‌రీరానికి కొలెస్ట్రాల్ కూడా చాలా అవ‌స‌రం. హార్మోన్లు, విట‌మిన్-డి త‌యారీలో కొలెస్ట్రాల్ మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే మన శరీరంలో మంచి , చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉన్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

అయితే కొలెస్ట్రాల్ అనేది.. తినడం, తాగడంలో నిర్లక్ష్యం చేయడం, ఇతర కారణాల వల్ల కూడా రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. అందుకనే కొలెస్ట్రాల్‌‌ను సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు. కొలెస్ట్రాల్ మన శరీరంలోని అన్ని కాణాలలో ఉంటుంది. శరీరం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు.. ఆహారం నుంచి కొలెస్ట్రాల్‌ను గ్రహిస్తుంది.


మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. అందులో ఒకటి లిపోప్రొటీన్ (LDL) చెడు కొలెస్ట్రాల్.. మరొకటి లిపోప్రొటీన్ (HDL) మంచి కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

Read More: థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా..!

శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డానికి అధిక బ‌రువు కూడా ఒక కార‌ణంగా చెప్పవచ్చు. బ‌రువు పెరిగితే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకుంటూ శ‌రీర బ‌రువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి కూడా శ‌రీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ధ్యానం, యోగా వంటివి చేస్తూ ఒత్తిడిని త‌గ్గించుకోవాలి.

అధిక ఆల్క‌హాల్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్‌తో పాటు ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆల్కాహాల్‌ను మితంగా తీసుకోవ‌డం మంచిది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాల‌నుకునే అల్పాహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. తీసుకునే ఆహ‌రంలో మంచి కొవ్వులు ఉండాలి. కోడిగుడ్డు తెల్ల‌సొన, అవకాడో వంటి వాటిని చేర్చుకోవాలి.

నూనెలో వేయించిన ఆహారాల‌కు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను విప‌రీతంగా పెంచుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. కాబట్టి జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అదే విధంగా శరీరానికి తగ్గట్టుగా నీటని తాగాలి.

Read More:  ఈ డ్రై ఫ్రూట్స్‌తో బరువు వేగంగా తగ్గుతారు..!

దీనివ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గ‌డంతో పాటు ర‌క్త‌నాళాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండాల‌నుకునే వారు ప్రోటీన్‌‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. చేప‌లు, చిక్కుళ్లు, గింజ‌లు వంటివి తీసుకోవ‌డం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

కొలెస్ట్రాల్ స్థాయిల‌ను ఎక్కువ‌గా పెంచే వాటిలో ధూమపానం ఒక‌టి. దీని కారణంగా గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. క‌నుక దీనిని వ‌దిలేయ‌డం మంచిది. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం వ‌ల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

Disclaimer: ఈ సమాచారం పలు పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా రూపొందించబడింది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×