Money Plant: ప్రస్తుతం నగరం నుంచి గ్రామం వరకు దాదాపు అందరి గృహాల్లోనూ దర్శనమిచ్చే మొక్క ఏదైనా ఉందంటే.. అది మనీ ప్లాంట్. చిన్న ప్రదేశంలోనూ సులభంగా పెరుగుతుందనే కారణంతో చాలామంది మనీ ప్లాంట్‌ను తమ ఇళ్లలో పెంచుతుంటారు. ఈ మొక్కు మట్టి అక్కర్లేదు. కేవలం నీటిలోనూ పెంచుకోవచ్చు. అందుకే అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, బాల్కనీలు వంటి చోట్ల కూడా ఈ ప్లాంట్ అలంకరణగా నిలుస్తోంది. అయితే, ఈ మనీ ప్లాంట్ కేవలం అందం కోసం మాత్రమే కాకుండా.. వాస్తు పరంగానూ మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వాస్తు ప్రకారం.. సంపదదకు, సానుకూల శక్తికి ప్రతీకగా మనీ ప్లాంట్‌ను భావిస్తారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఆరోగ్యంగా ఎదుగుతుంటే.. ఆ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం వస్తుందనే నమ్మకం ఉంది. అదే ఈ మొక్క వాడిపోయినా లేదా ఎండిపోయినా.. ఆర్థిక ఇబ్బందులు రావొచ్చని కొందరు విశ్వసిస్తారు. అయితే, దీని వెనుకున్న వాస్తవం ఏంటంటే.. ఈ మొక్క చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
ఈ మనీ ప్లాంట్.. వాతావరణంలో ఉన్న హానికరమైన వాయువులను పీల్చుకుని, స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. బెంజీన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికర రసాయనాలను ఈ ప్లాంట్ తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్లే ఈ మొక్కను నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటారు. ఇంట్లో ఉండే చిన్నారులు, వృద్ధులకు శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఇది సహాయపడుతుంది.
మనీ ప్లాంట్ యొక్క పచ్చదనాన్ని చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. చాలామంది ఈ ప్లాంట్‌ను టేబుల్ పైన, బాల్కనీలో లేదా కిచెన్ దగ్గర పెట్టుకోవడానికే ఇష్టపడతారు. ఆ పచ్చని ఆకులు కంటికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకొంతమంది ఆఫీసు టేబుల్ల పైనా దీన్ని ఉంచి సానుకూల వాతావరణం సృష్టించుకుంటారు.
తాజాగా ఫెంగ్‌షుయ్ నిపుణులు కూడా మనీ ప్లాంట్‌ను గుడ్ లక్ ప్లాంట్‌గా పేర్కొన్నారు. చైనీస్ సాంప్రదాయ ప్రకారం.. మనీ ప్లాంట్ ధనలక్ష్మిని ఆకర్షించే చిహ్నంగా భావిస్తారు. అందుకే దీన్ని శుభప్రదమైన మొక్క అని కూడా పిలుస్తుంటారు.