Lavanya tripathi: సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్స్ కెరియర్ వివాహానికి ముందు వివాహానికి తరువాత అన్నట్టుగా ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ భర్తలు తమ భార్యలకు అండగా నిలిస్తే, మరి కొంతమంది చెప్పిన మాట వినలేదని విడాకులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా దాదాపు నాలుగైదు సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది జూన్ నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకొని, ఈ ఏడాదికి యానివర్సరీ పూర్తి చేసుకున్నారు. వారు ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi).
మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు..
వివాహం అనంతరం వరుణ్ తేజ్ ‘మట్కా'(Matka ) సినిమాతో నవంబర్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అటు లావణ్య త్రిపాఠి వివాహానికి ముందు నటించిన వెబ్ సిరీస్ లను విడుదల చేసింది. కానీ వివాహం తర్వాత రీఎంట్రీ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మట్కా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ కి భార్య రీ ఎంట్రీ పై పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. మరి ఈ విషయంపై వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
భార్య రీఎంట్రీ పై క్లారిటీ..
లావణ్య త్రిపాఠి రీ ఎంట్రీ పై వరుణ్ మాట్లాడుతూ.. “లావణ్య ప్రస్తుతం సినిమాలు చేయడానికి రెడీగా ఉంది. కాకపోతే గతంలో వచ్చిన సినిమాలు చేసింది.. పాత్రకు ప్రయారిటీ ఇవ్వలేదు. ఆ జర్నీ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు కదా.. ప్రస్తుతం తాను కంఫర్టబుల్ ప్లేస్ లోనే ఉంది. ఇప్పుడు ఏది పడితే అది చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. తాజాగా లావణ్య కథలు వింటోంది త్వరలోనే సినిమా చేస్తుంది. ఇద్దరం కూడా మంచి కథ వస్తే చేస్తాము. మంచి పాత్ర దొరకాలి దానికి తోడు స్క్రిప్ట్ కూడా కుదరాలి. అప్పుడే తాను చేస్తుంది. అదే సమయంలో పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదు అనే కండీషన్ మెగా ఫ్యామిలీ పెట్టింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే అలాంటి మైండ్ సెట్ లో మా మెగా ఫ్యామిలీ లో ఎవరూ లేరు. పెళ్లయ్యాక కూడా ఆమె నిరభ్యంతరాయంగా సినిమాలు చేయవచ్చు. ఇక పిల్లల గురించి అంటారా..? ఇప్పట్లో ఆలోచనలు లేవు. లావణ్యకు నచ్చినప్పుడే ముందడుగు వేస్తాము” అంటూ కామెంట్ చేశారు వరుణ్ తేజ్. ఇక లావణ్య గురించి, ఆమె కెరియర్ గురించి వరుణ్ తేజ్ పడుతున్న తపన చూసి “ఇలా కూడా ఉంటారా?” అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వరుణ్ తేజ్ మంచి మనసుకి అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. మరోవైపు ఒక్క మాటతో అటు ట్రోల్స్ కి కౌంటర్ ఇస్తూ.. భార్య రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.
మట్కా సినిమా విడుదల..
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ కరుణ కుమార్ (Karuna Kumar)దర్శకత్వంలో ‘మట్కా’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా .ఈ సినిమా నవంబర్ 14 అనగా రేపు విడుదల కాబోతోంది. వివాహం తర్వాత విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.