BigTV English

Stomach Cancer : పొట్ట క్యాన్సర్‌తో మరణించిన ఇళయరాజా కూతురు.. కారణాలు ఇవే..!

Stomach Cancer : పొట్ట క్యాన్సర్‌తో మరణించిన ఇళయరాజా కూతురు.. కారణాలు ఇవే..!

Ilaiyaraaja Daughter : ఇళయరాజా కూతురు భవతరాణి మరణించిన విషయం మన అందిరికీ తెలిసిందే. ఆమె పొట్ట క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీని కారణంగానే చాలా కాలంగా శ్రీలంకలో చికిత్స తీసుకుంటూ హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. మనలో చాలా మందికి పొట్ట క్యాన్సర్ అనగానే ఆశ్చర్యపోయింటారు. క్యాన్సర్‌లో పొట్ట క్యాన్సర్ అనే వ్యాధి ఉందా.. అనే సందేహాలు కలిగుంటాయి. అయితే ఈ పొట్ట క్యాన్సర్ అంటే ఏమిటి? ఎలా వస్తుంది? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


పొట్ట క్యాన్సర్‌ను గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది పొట్టలో ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేస్తుంది. పొట్ట లోపల కాన్సర్ కణాలు ఏర్పడుతాయి. తర్వాత అవి పెద్ద కణితలుగా మారుతాయి. ఈ కణితలు పెరిగి పక్క అవయవాలకు కూడా సోకుతాయి. పొట్ట క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి. లేదంటే కాలేయం, ఊపిరితిత్తులుకు వ్యాపిస్తుంది. దీని కారణంగా ప్రాణాలు కూడా పొవచ్చు.

Read More: ఈవినింగ్ 7 తర్వాత ఇవి చేయండి..!


పొట్ట క్యాన్సర్‌ను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే దీని లక్షణాలు అంతగా మన శరీరంలో కనపడవు. ఇది చాలా తక్కువ లక్షణాలను చూపిస్తుంది. కానీ పొట్టలో క్యాన్సర్ కణితలు పెరిగాక కొన్ని లక్షణాలు కనపడతాయి. ఆ లక్షణాలు ఎంటో చూద్దాం.

పొట్ట క్సాన్సర్ కారణంగా గుండెల్లో నొప్పిగా ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. తిన్నా ఆహారం కూడా సరీగా అరగదు. మలంలో రక్తం వస్తుంది. తరచూ పొట్ట నొప్పి బాధిస్తుంది. ఆహారం మింగడం ఇబ్బందిగా మారుతుంది. బరువు ఒక్కసారిగా తగ్గిపోతారు.చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

పొట్ట క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువు వల్ల పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇది వారసత్వంగా కూడా వస్తుంది. మంటలపై కాల్చిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఇటువంటి ఆహారం వల్ల కూడా పొట్ట క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధిక ఉప్పు కూగా పొట్ట క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

కూరగాయలు, పండ్లు తక్కువగా తినే వారు ఈ పొట్ట క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో వీటిని తీసుకోండి. స్మోకింగ్ చేసే వారికి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కొన్ని అంటువ్యాధుల వల్ల కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. A బ్లడ్ గ్రూప్ వారికి పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read More : రోజుకో గుడ్డును గుటుక్కున మింగేయండి..!

పొట్ట క్యాన్సర్ నుంచి మనల్ని రక్షించుకోవాలంటే బరువును అదుపు చేయండి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటుకు దూరంగా ఉండాలి. తాజా ఆకుకూరలు, పండ్లు అధికంగా తినండి. పొట్ట క్యాన్సర్ నాలుగో దశకు చేరుకుంటే చికిత్స చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మొదటి దశలోనే పొట్ట క్యాన్సర్‌ను గుర్తించండి. ఆరోగ్యకరమైన అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Disclaimer : ఈ కథనం కేవలం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్‌‌‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×