BigTV English

Pileru Assembly Constituency: పీలేరులో టీడీపీ కల నెరవేరబోతుందా..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?

Pileru Assembly Constituency: పీలేరులో టీడీపీ కల నెరవేరబోతుందా..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?
AP election updates

Big TV Survey on Pileru Assembly Constituency: ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి. ఈ సెగ్మెంట్ అటు తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాయచోటి, పలమనేరు వంటి ప్రాంతాలకు మధ్యలో అన్నిటికీ 57 కిలోమీటర్ల డిస్టెన్స్ లో సెంటర్ లో ఉంటుంది. రాజకీయంగా, వాణిజ్యపరంగా కీలక ప్రాంతమిది. 1994కు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్ లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. అప్పటి నుంచి పోరాడుతూ ఓడుతూనే వస్తోంది. మరి ఇప్పుడు పీలేరులో రాజకీయ సమీకరణాలు మారాయా? పీలేరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

చింతల రామచంద్రారెడ్డి (వైసీపీ విజయం) VS నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి


2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి 49 శాతం ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులు 6 శాతం ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపునకు కారణం ఆయన వ్యక్తిగత ఇమేజ్. అలాగే జగన్ వేవ్ తోడవడం మరో రీజన్. అలాగే 2017లో టీడీపీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 4.4 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. మరోసారి ఈ ఇద్దరి మధ్యే పోటీకి పీలేరు సిద్ధమైంది. మరి ఈసారి ఎన్నికల్లో పీలేరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Read More: Ramachandrapuram Assembly Constituency: రామచంద్రాపురం రాజెవరు? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?

చింతల రామచంద్రారెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

  • తన హయాంలో సెగ్మెంట్ అభివృద్ధి పుంజుకోవడం
  • పార్టీ క్యాడర్ లో రామచంద్రారెడ్డికి మంచి ఇమేజ్
  • క్యాడర్ కు అవసరమైనప్పుడు విద్య, వైద్యానికి ఆర్థిక సహాయాలు
  • 100 బెడ్లతో కొత్త మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మాణం
  • పాత హాస్పిటల్ 100 బెడ్లకు పెంచడం
  • PHCలలో వైద్య సౌకర్యాలు మెరుగవడం
  • స్కూల్స్ లో మౌలిక వసతులు పెరగడం
  • సెగ్మెంట్ వ్యాప్తంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం
  • పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఎఫెక్ట్ ఉండడం

చింతల రామచంద్రారెడ్డి మైనస్ పాయింట్స్

  • వైసీపీ నేతలు, కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు
  • పీలేరు సెగ్మెంట్లో పార్టీ ఇమేజ్ పై పెరిగిన నెగెటివిటీ
  • ప్రజా వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారన్న డౌట్లు

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

  • పీలేరు సెగ్మెంట్ లో జనంలో నల్లారికి మంచి ఇమేజ్
  • మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడిగా గుర్తింపు
  • 2014, 2019లో ఓడడంతో జనంలో కిషోర్ పై పెరిగిన సానుభూతి
  • పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం
  • బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, జయహో బీసీ క్యాంపెయినింగ్
  • టీడీపీ నుంచి మరో నేత టిక్కెట్ కోసం పోటీ పడకపోవడం
  • టీడీపీ-జనసేన పొత్తుతో 15% కాపు ఓటర్ల సపోర్ట్ కు ఛాన్స్

ఇక వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

చింతల రామచంద్రారెడ్డి VS నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పీలేరులో వైసీపీ, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇందులో టీడీపీకి కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో దిగితే ఆయనకు 49 శాతం ఓట్లు, ఇక వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి 47 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య కేవలం 2 శాతం ఓట్ షేర్ మాత్రమే తేడా తేడా ఉంది. తటస్థ ఓటర్ల తీర్పు కీలకం కాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో రెండుసార్లు ఓడిన సానుభూతి, జనసేనతో పొత్తు కూడా టీడీపీ అభ్యర్థికి కీ రోల్ పోషించబోతున్నట్లు తెలిసింది. పీలేరు సెగ్మెంట్ లో కాపు సామాజికవర్గం జనాభా 18 శాతంగా ఉంది. వీరిలో మెజార్టీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీవైపు పడుతాయన్న అంచనాలున్నాయి. అటు వైసీపీ ఓట్ షేర్ కు కారణం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఈ సెగ్మెంట్ ప్రజలతో మంచి సత్సంబంధాలున్నాయి. వారి ఇమేజ్ కూడా వైసీపీ ఓట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి.

Related News

YS Raja Reddy: రాజారెడ్డికి అమ్మమ్మ ఆశీర్వాదం.. తల్లితోపాటు అక్కడికి, జగన్ టీమ్‌లో కలకలం

CM Progress Report: ఏపీలో ఫేక్ న్యూస్‌పై ఫైట్ షురూ.. సీఎం సంచలన నిర్ణయం..

Road accident: మద్యం మత్తులో కారు డ్రైవర్.. ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి.. విజయనగరంలో ఘటన!

Hindu temples: గ్రహణంలోనూ తెరిచి ఉన్న ఏకైక ఆలయం.. ఏపీలో ఉందని మీకు తెలుసా!

Tirumala News: నేడు శ్రీవారిని దర్శించిన భక్తులెందరో తెలుసా? రేపటికి టీటీడీ సిద్ధం!

Visakhapatnam fire: పిడుగు పడి పేలిన పెట్రో ట్యాంక్.. విశాఖలో కలకలం!

Big Stories

×