Head Massage: తలకు మసాజ్ చేయించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో సమయం మిగలక ఎంతోమంది మసాజ్ జోలికి వెళ్లరు. నిజానికి వారంలో ఒక్కసారి తలకు మసాజ్ చేయించుకుని చూడండి. ఆ వారం అంతా మీకు ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. మీ మెదడు చక్కగా ఆలోచిస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. మీ మెరుగైన మానసిక స్థితి వల్ల మీ తెలివితేటలు కూడా పెరుగుతాయి. ప్రతిదీ ఆచితూచి అడుగేస్తారు.
తలకు తేలికపాటి మసాజ్ చేయడం వల్ల నదులుకు రక్త సరఫరా బాగా జరుగుతుంది ఈ ప్రసరణ వల్ల మెదడు లో ఆక్సిజన్ పోషకాలను అధికంగా పొందుతుంది ఇది అభివృద్ధి పనితీరును మెరుగుపరుస్తుంది జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది
ఒత్తిడి అనేది మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఒత్తిడి కారణంగానే ఎంతోమంది వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నారు. తలకు మసాజ్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతంగా మారుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. తలకు మసాజ్ అనేది సహజ ఒత్తిడి నివారిణిగా పనిచేస్తుంది. మసాజ్ చేసే సమయంలో సున్నితమైన స్ట్రోక్స్ వేళ్ళతో ఇస్తూ ఉంటారు. ఇది ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది. తలపై ఉండే మాడును మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి హార్మోను తక్కువగా ఉత్పత్తి అవుతుంది. రక్తపోటు హృదయస్పందన రేటు కూడా సానుకూలంగా మారుతాయి.
Also Read: ప్రతి రోజు ఉదయం నానబెట్టిన శనగలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?
జుట్టు పెరుగుతుంది
జుట్టు ఆరోగ్యానికి హెడ్ మసాజ్ ఎంతో ఉపయోగపడుతుంది. తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు బలంగా ఎదగడం మొదలవుతుంది. హెయిర్ ఫోలికల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఇవి జుట్టు పెరుగుదలను పెంచుతాయి. భావోద్వేగాలను మెరుగుపరిచి మెదడు చక్కగా పనిచేసేలా చేస్తుంది. మానసిక ఆరోగ్యం తగ్గుతుంది.
ఏ నూనెలతో..
బాదం, కొబ్బరి లేదా ఆలివ్ నూనెలతో హెడ్ మసాజ్ చేసుకోవచ్చు. ఈ నూనెలో గోరువెచ్చగా వేడి చేసి ఆ తర్వాత హెడ్ మసాజ్‌కి ఉపయోగించండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. చేతివేళ్లతోనే మసాజ్ చేయాలి. మసాజ్ నిపుణులు వద్దకు వెళితే వారు చక్కగా మీకు హెడ్ మసాజ్ చేస్తారు.