BigTV English

Black Chana Benefits: ప్రతి రోజు ఉదయం నానబెట్టిన శనగలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?

Black Chana Benefits: ప్రతి రోజు ఉదయం నానబెట్టిన శనగలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?

Black Chana Benefits: నానబెట్టిన శనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శనగల్లో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరుచుగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. ఎన్నో పోషకాలు ఉన్న పచ్చి శనగపప్పును ప్రతి రోజు ఉదయం తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.


బరువు తగ్గుదలకు: నానబెట్టిన శనగలు బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. బరువు తగ్గాలని అనుకునే చాలా మంది అన్నం తినడం మానేసి చపాతీల వంటివి తింటారు. అలా కాకుండా బరువు త్వరగా తగ్గాలని అనుకునే వారు ప్రతి రోజు ఉదయం పూట నానబెట్టిన శనగలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఖాళీ కడుపుతో శనగలను తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో తినాలనే ఫీలింగ్ ఎక్కువగా ఉండదు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మధుమేహం:  నానబెట్టిన శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయి వెంటనే పెరగదు. వీటిలోని పోషకాలు మధుమేహం రాకుండా చేస్తాయి.


గుండె ఆరోగ్యం: నానబెట్టిన శనగల్లో పుష్కలంగా విటమిన్లు, పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే శనగలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అంతే కాకుండా నానబెట్టిన శనగలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి దోహదం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

శక్తి :  నానబెట్టిన శనగల్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి, పెరుగుదలకు సహాయపడుతుంది. నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. చాలా కాలం పాటు అలసిపోకుండా చేస్తుంది.

కంటి ఆరోగ్యం: నేటి డిజిటల్ యుగంలో పొద్దున లేచిన దగ్గరి నుంచి అర్థ రాత్రి వరకు సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ల ముందు గంటల తరబడి సమయం గడుపుతున్నాం ఇవి కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నల్లటి శనగలను తినాలి. వీటిని తరుచుగా తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా దృష్టి మెరుగుపడుతుంది.

Also Read:  ప్రతి రోజు వెల్లుల్లి తింటే ఈ సమస్యలన్నీ పరార్ !

రోగనిరోధక శక్తి: నానబెట్టిన శనగలు ప్రతి రోజు తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. వాటిలోని పోషకాలు సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఇవి రక్షిస్తాయి.

శరీరానికి బలం : నల్లటి శనగల్లో ఉండే ప్రోటీన్, ఐరన్, విటమిన్లతో పాటు ఇతర పోషకాలు తినడం వల్ల శరీరానికి కావలసిన బలం అందుతుంది. అంతే కాకుండా రెగ్యులర్ గా శనగలు తినడం వల్ల అలసట రాకుండా ఉంటుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×