BigTV English

Coconut Milk: కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు మీ గుండె పదిలం

Coconut Milk: కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు మీ గుండె పదిలం
Coconut Milk: కొబ్బరిపాలతో చేసే ఆహార పదార్థాలు టేస్టీగా ఉంటాయి. నిజానికి కొబ్బరిపాలను చిన్న గ్లాసుతో ప్రతిరోజు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కొబ్బరి పాలలో పోషకాలు నిండుగా ఉంటాయి. ఇది సమతుల్య ఆహారంలో భాగమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గేదె, ఆవు పాలు పడని వారు కొబ్బరి పాలను తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కొబ్బరిపాలను సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు


తాజా కొబ్బరిని ముక్కలుగా చేసి మిక్సీలో వేసి తగినంత నీళ్లు వేసి తీసే మిశ్రమమే కొబ్బరిపాలు. ఇది చాలా రుచిగా ఉంటుంది. తాగితే ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది. ఈ కొబ్బరి పాలలో క్యాలరీలు అంత ఎక్కువగా ఉండవు. అలాగే కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. డైటరీ ఫైబర్, ప్రోటీన్, కాపర్, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. పొటాషియం, విటమిన్ సి కూడా కొబ్బరిపాలతో లభిస్తాయి. కాబట్టి ఇది శక్తిని అందిస్తుంది. బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.

రోజూ ఎంత తాగాలి?
రోజుకో అరకప్పు కొబ్బరి పాలను తాగితే ఎంతో మంచిది. దీనిలో ఉండే మంచి కొవ్వులు శరీరానికి ఉపయోగపడతాయి. కొబ్బరి పాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మీ జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.


కొబ్బరి పాలలో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరి పాలలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి త్వరగా మీకు శక్తిని అందిస్తాయి. బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి.

Also Read: మందార పువ్వుతో ఈ హెయిర్ సీరమ్ ట్రై చేసారంటే.. ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది..

ఆధునిక తరంలో ఎక్కువ మంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అంటే తల్లిపాల నుంచి ఆవుపాల వరకు ఏ జీవి నుంచి వచ్చిన పాలను కూడా వీరు అరిగించుకోలేరు. అలాంటి వారికి కొబ్బరిపాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని స్మూతీలు, సూపులు, డిజర్ట్ లో వేసుకొని తాగితే ఎంతో టేస్ట్ గా ఉంటుంది. అంతేకాదు  వీటిని నేరుగా తాగినా చాలు, సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా ఎన్నో పోషకాలను అందిస్తుంది. కొబ్బరి పాలలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును మారుస్తాయి.

గుండె ఆరోగ్యానికి కచ్చితంగా తినాల్సిన వాటిల్లో కొబ్బరి పాలు, పచ్చికొబ్బరి ఒకటి. వీటిలో ఉండే కొలెస్ట్రాల్ ఎంతో మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కొబ్బరిపాలు మన శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచడంలో కూడా ముందుంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలన్నా ప్రతిరోజు చిన్న గ్లాస్ తో కొబ్బరిపాలు తాగినందుకు ప్రయత్నించండి.

మిల్క్ షేక్ చేసుకుని అలవాటు ఉన్నవారు కొబ్బరిపాలతో మిల్క్ షేక్ చేసేందుకు ట్రై చేయండి. ఇది కొత్త రుచిని అందించడమే కాదు, ఎంతో ఆరోగ్యకరం కూడా.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×