BigTV English

Dinga Dinga Dance: ఆ దేశ ప్రజలతో డాన్స్ చేయిస్తున్న డింగా డింగా వ్యాధి, ఇది మహమ్మారిగా మారుతుందా?

Dinga Dinga Dance: ఆ దేశ ప్రజలతో డాన్స్ చేయిస్తున్న డింగా డింగా వ్యాధి, ఇది మహమ్మారిగా మారుతుందా?

కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్న కాలం ఇది. అలాగే ఆఫ్రికాలోని ఉగాండా దేశంలోని ఒక జిల్లాలో వింత వ్యాధి బయటపడింది. దాని పేరు డింగా డింగా. ఈ వ్యాధి బారిన పడి 300 మంది రోగులుగా మారారు. ఈ వ్యాధి చాలా భిన్నమైనది. దీనికి డాన్సింగ్ డిసీజ్ అని కూడా పేరు ఉంది. ఈ వ్యాధి సోకిన వారు డాన్స్ చేస్తున్నట్టు వణుకుతూనే ఉంటారు. అందుకే ఈ వ్యాధికి డింగా డింగా అని పేరు పెట్టారు.


ఉగాండాలోని బుండిబుక్యో జిల్లాలో ఈ వింత వ్యాధి తొలిసారి బయటపడింది. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారిలో మహిళలు, ఆడపిల్లలే ఎక్కువ. ఈ వ్యాధి తీవ్రమైన జ్వరంతో వస్తుంది. అలాగే చలితో వణికిపోతారు. ఆ వణకడం వల్ల వారు త్వరగా నడవలేరు. కూర్చున్న చోటే డాన్స్ చేస్తున్నట్టు వణుకుతూ ఉంటారు. ఇది వైరస్ వల్ల సోకుతుందని గుర్తించారు వైద్యులు.

డింగా డింగా అనే వైరస్ సోకిన వారికి జ్వరంతోపాటు శరీరం తీవ్రంగా వణకడం మొదలవుతుంది. అలాగే వారు విపరీతంగా బలహీనంగా మారిపోతారు. కనీసం నడవలేరు. ఎవరో ఒకరి సాయం తీసుకోకుండా ఏమీ చేయలేరు. దీనికి సరైన చికిత్స కూడా లేదు. జ్వరం లక్షణాలను తగ్గించేందుకే వైద్యులు ప్రయత్నిస్తున్నారు. అలాగే చలిని తట్టుకునే శక్తిని అందిస్తున్నారు. అంతే తప్ప దీనికి ప్రత్యేకమైన చికిత్స, వ్యాక్సిన్, మందులు వంటివి కనిపెట్టలేదు.


డింగా డింగా వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకితే శరీర కదలికపై నియంత్రణ ఉండదు. ఇది ఒక అత్యంత విలక్షణమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే కాస్త ఇబ్బంది పెట్టేదని కూడా చెప్పాలి. ఎదుటివారికి ఈ వ్యాధి సోకిన వ్యక్తులు నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారిలో తీవ్రంగా వణుకువస్తుంది. నడవడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. అలాగే జ్వరం ఎక్కువగా ఉండి తీవ్రమైన బలహీనత రావడం వల్ల వారు పక్షవాతం వచ్చినట్టు అయిపోతారు. కొంతమంది వ్యక్తులు కనీసం అడుగు తీసి అడుగు వేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక వారం రోజులపాటు రోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత దీనిలో లక్షణాలు నెమ్మదిస్తూ ఉంటాయి.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా ఒక తెలియని వ్యాధి వ్యాపించింది. ఇది ఇప్పటికే 300 మందిని మరణించేలా చేసింది. మరొక 400 మంది ఆ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఇన్ఫ్లుయేంజా నుండి వైరల్ ఇన్ఫెక్షన్ల వరకు అనేక కారణాల వల్ల వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

చరిత్రలో చూసుకుంటే 1518లో డాన్స్ ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. అలాంటిదే డింగా డింగా వ్యాధి అని చెప్పుకుంటున్నారు. చరిత్రకారులు ఫ్రాన్స్ లోని స్ట్రాస్వర్క్ లో వందలాదిమంది డాన్స్ చేస్తూ చేస్తూనే మరణించారు. వారికి ఎలాంటి వైరస్ సోకిందో కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారు. రోడ్లమీద, ఇళ్లల్లోనూ డాన్స్ చేసుకుంటూ అలసిపోయి కిందపడి ఎంతోమంది మరణించారు. కొంతమందిని ఒక రూమ్ లో పెట్టి బంధించారు.

Also Read: కాఫీ తాగితే కిడ్నీలు పాడవుతాయా?

ఈ చారిత్రక సంఘటన అప్పట్లో పెద్ద సంచలనమనే చెప్పాలి. అయితే ఆ చారిత్రిక వ్యాధికి, డింగా డింగా వ్యాధికి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ… లక్షణాలలో మాత్రం సారూప్యత ఉన్నట్టు గుర్తించారు. డింగా డింగా వ్యాధి వల్ల ఇంతవరకు ఒక్క ప్రాణం పోలేదు, కాబట్టి ఇది ప్రాణాలు తీసే అంత తీవ్రమైన వ్యాధిగా పరిగణించడం లేదు. జ్వరానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి మందులు ఇవ్వడం ద్వారా వారం నుండి పది రోజుల్లో ఆ వ్యాధిని నియంత్రణలోకి తీసుకువస్తున్నారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×