HBD Sandeep Reddy Vanga: ఒక సినిమా హిట్ అవ్వడానికి చాలా రకమైన ఆస్పెక్ట్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ముందు కథ బాగుండాలి. ఆ తర్వాత ఆ కథను డీల్ చేసే విధానం బాగుండాలి. కొన్నిసార్లు పేపర్ పైన అందంగా కనిపించే కథ వెండితెరపై మాత్రం పేలవంగా అనిపిస్తుంది. దీనికి దర్శకుడు ఆ కథను డీల్ చేసే విధానం. నటీనటులు నటించిన తీరు. ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఒక మంచి కథను రాయడం ఎంత ముఖ్యమో అదే కథను వెండితెరపై ఆవిష్కరించడం కూడా అంతే ముఖ్యం.
అయితే పేపర్ మీద కథను సినిమాగా తెరకెక్కించినప్పుడు. వాటికి చాలా ఆస్పెక్ట్స్ తోడు అవుతూ ఉంటాయి. దీంట్లో ఒక సినిమా హిట్ అవ్వడానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఎంత కీలకపాత్రను వహిస్తాయో. మ్యూజిక్ కూడా అంతే కీలకపాత్రను వహిస్తుంది. సంగీతానికి రాళ్లు కరుగుతాయి అని అంటారు. అలానే ఒక మంచి సీన్ కి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ జోడిస్తే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మనసులు కూడా కరుగుతాయి అని చెప్పొచ్చు.
అసలు ఒక సినిమా మీద అంచనాలను పెంచేది ఆ సినిమా మ్యూజిక్. ఒక సినిమా పాటలు బాగున్నాయి అని అంటే ఖచ్చితంగా ఆ పాటలు కోసమే థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఉంటారు. అలా పాటల కోసం ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి హిట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. పాత రోజుల్లో అయితే ఐటెం సాంగ్స్ కోసం కూడా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ ఉన్నారు.
రీసెంట్ టైమ్స్ లో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి కావాల్సింది ఫస్ట్ అఫ్ ఆల్ పాటలు బాగుండటం. అలానే డైరెక్టర్ కి మ్యూజిక్ సెన్స్ ఉంటే అది చాలా ప్లస్ అవుతుంది. అలా ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ గురించి చెప్పుకోవాలి. సందీప్ రెడ్డి వంగకి ఉన్న మ్యూజిక్ సెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమా రధన్ తో చేశాడు. రధన్ తనను చాలా ఇబ్బంది పెట్టాడని ఓపెన్ గానే బయటపెట్టాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగకి స్ట్రెంత్ ఏంటి అని అడిగినప్పుడు నేను బాగా మ్యూజిక్ వింటా, మ్యూజిక్ నా స్ట్రెంత్ అని కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
నేనింతే సినిమాలో రవితేజ అంటాడు వాళ్ళ డైరెక్టర్ తో కామెడీగా ఏం మ్యూజిక్ సెన్స్ సర్, ఏం మ్యూజిక్ సెన్స్ సర్ అని. కానీ రీసెంట్ టైమ్స్ లో నిజంగా “ఏం మ్యూజిక్ సెన్స్” అనిపించిన ఫిలిం మేకర్ ఎవరైనా ఉన్నారంటే అది సందీప్ రెడ్డి. అందరూ టెక్నికల్ గా సినిమాను ఎలా తీశాడు.? షాట్ ఎలా పెట్టాడు.? ఫ్రేమ్ ఎలా పెట్టాడు.? అని డిస్కస్ చేస్తారు. కానీ సందీప్ మ్యూజిక్ వీటన్నిటికీ ఒక మెట్టు పైనే ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ చేసిన రెండు సినిమాలు కి హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాడు.
కానీ వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది అంటే ఒక చిన్న విజిల్ తో, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో “ఓ మనిషి ఓ మహర్షి” అనే ఒక పాట ఉంటుంది. ఆ పాటలో 2:21- 2:42 Duration లో విజిల్ వినిపిస్తుంది. ఆ విజిల్ ని వేసింది హర్షవర్ధన్ రామేశ్వర్. దానికి ఇంప్రెస్ అయ్యి సందీప్ రెడ్డి వంగ హర్షవర్ధన్ తో ట్రావెల్ చేసి రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పించుకున్నాడు.ఒక విజిల్ తో సినిమాను అవకాశంగా ఇవ్వడం అంటే ఆ డైరెక్టర్ కు మ్యూజిక్ పై ఎంత పట్టుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలానే మంచి పాటలతో పాటు అద్భుతమైన సినిమాలను కూడా తీయాలని కోరుకుంటూ బిగ్ టీవీ తరపున హ్యాపీ బర్త్డే సందీప్ రెడ్డి వంగ.
Also Read : Bobby Deol : జగపతిబాబుకి బోయపాటి శ్రీను, బాబి డియోల్ కి సందీప్ రెడ్డి వంగ