Big Stories

Sugarcane Juice Benefits: చెరుకురసంతో ఎన్నో బెనిఫిట్స్.. వీళ్లు మాత్రం తాగకూడదు!

Sugarcane Juice Benefits

- Advertisement -

Sugarcane Juice Benefits: ప్రస్తుతం సమ్మర్ సీజన్ మొదలైంది. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్లో రక రకాల జ్యూస్ లు, శీతల పానీయాలు ఎక్కువగా అమ్ముడు పోతుంటాయి. వీటితో పాటు చెరుకు రసానికి మంచి డిమాండ్ ఉంటుంది. చెరుకు రసం తాగడానికి రుచికరంగా ఉండటమే కాకుండా పోషణనతో నిండిన చెరుకు రసం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా అనేక వ్యాధులు నుండి కూడా రక్షిస్తాయి. వాటిలో కార్బోహైడ్రేట్స్, కాల్షియం. జింక్, మెగ్నీషియం, అనేక రకాల పోషకాలు ఉన్నాయి. చెరుకు రసం శరీరాన్ని చల్లబరుస్తుంది. వీటిలో ఉండే పోషకాలు జీర్ణక్రియ, ఎముకలు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

- Advertisement -

అంతే కాదు రక్త హీనతను నివారించడంలో కూడా సహాయపడతాయి. చెరుకు రసం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి మధుమేహ వ్యాధిగ్రస్తులకి మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుందనే చెప్పాలి. దీనిలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్(GL) అధిక గ్లైసమిక్ లోడ్ (GL) కలిగి ఉంటుంది.  దీని కారణంగా డయాబెటిక్ రోగి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. చెరుకు రసంలో దాదాపు 240 మిల్లీ లీటర్ల చెరుకు రసంలో 50 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే సుమారు 12 స్పూన్ల చక్కెరతో సమానం. చెరుకు రసాన్ని తీసుకోవడ్ వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అందుకే దీనిని డయాబెటిస్ ఉన్న వాళ్లు తాగకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: వాసన భరించలేకపోయినా.. చెమట మంచిదే!

నిద్రలేమి సమస్య ఉన్నవారు చెరుకు రసం తీసుకోకపోవడమే మంచిది. వీటిలో ఉండే పోలికోసనాల్ నిద్రపై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా నిద్రలేమి, ఒత్తిడి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వాళ్లు చెరుకు రసాన్ని తీసుకోకూడదు. చెరుకు రసంలో ఉండే పోలికోసనాల్ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీని కారణంగా వాంతులు, అతిసారం, కడుపునొప్పి, వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

చెరుకు రసం శీతలీ కరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని కారణంగా జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

స్థూలకాయంతో బాధపడే వారు చెరుకురసం తీసుకోకూడదు. అవి అధిక కంటెంట్ ను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవడం వల్ల బరువు పెరగొచ్చు.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు, మెడికల్ జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా
రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News