BigTV English

Sweat Benefits: వాసన భరించలేకపోయినా.. చెమట మంచిదే!

Sweat Benefits: వాసన భరించలేకపోయినా.. చెమట మంచిదే!
sweat benefits
sweat benefits

Benefits of Sweat: చెమట అనేది ప్రతి ఒక్కరికి పడుతుంది. కానీ ఎండా కాలంలో మాత్రం కాస్త ఎక్కువగా పడుతుంది. దీంతో ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఇటు తాగిన నీరంతా అటు చెమట రూపంలో పోతూ ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరినప్పుడు చెమట పట్టడం అనేది కామన్. చాలా మంది చెమట పట్టడం వల్ల శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుందని భావిస్తారు. కానీ ఈ భావనలో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. చెమట ఆరోగ్యానికి మంచిదే. చెమట వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చెమట వల్ల చర్మానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.


ఎండాకాలంలో ఉక్కపోత వల్ల చెమట తీవ్రంగా పడుతుంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రతలు 91 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఫారన్ హీట్ వరకు చేరుతాయి. ఈ కాలంలో చెమట విపరీతంగా పట్టడం వల్ల శరీరం తొందరగా అలిసిపోతుంది. వేసవి కాలంలో శరీరంలోని వేడి వల్ల చెమట బయటకు రావడం సర్వసాధారణం. దీని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Also Read: సమ్మర్.. ఈ ఐదు పండ్లను కచ్చితంగా తినాల్సిందే!


చెమట పడితే చర్మానికి చాలా మంచిది. చెమట వల్ల శరీరం కాస్త దుర్వాసన వచ్చినా శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల శరీరంలో హీట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. చర్మం కూడా తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి చెమట చర్మానికి మంచే చేస్తుంది. శరీరానికి చెమట పట్టేలా శ్రమ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.

చెమట చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చెమట బయటకు వచ్చినప్పుడు చర్మం మెరుస్తుంది. చెమట రంధ్రాలు ఓపెన్ అవడం వల్ల చర్మంపై పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వస్తాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చెమట శరీరంలోని విషాన్ని బయట వేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిస్తుంది. దీనివల్ల శరీరం శుభ్రం అవుతుంది. శరీర అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి.

Also Read: సమ్మర్.. కూలర్ ఇలా వాడితే ఆ వ్యాధులు.!

చెమట శరీరంలోని ఉప్పును కూడా తొలగిస్తుంది. శరీరంపై దుమ్ము, ధూళి, మురికి పట్టకుండా చేస్తుంది. అలానే రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. బ్యాక్టీరియల్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. టాక్సిన్స్ ను దూరం చేస్తుంది. ఇలా చెమట వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చెమట పట్టినప్పుడు శుభ్రం చేసుకోండి.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు, మెడికల్ జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా
రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Tags

Related News

Eye Care: కంటి సమస్యలు రాకూడదంటే.. ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Get Rid of Pimples: మొటిమలు త్వరగా తగ్గాలంటే ?

Warm Water: ఉదయం పూట గోరు వెచ్చని నీరు తాగితే.. ?

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Big Stories

×