BigTV English

Hair Loss: నిద్రపోతున్నప్పుడు మీరు చేసే ఈ పొరపాట్ల వల్ల జుట్టు రాలుతుందని మీకు తెలుసా ?

Hair Loss: నిద్రపోతున్నప్పుడు మీరు చేసే ఈ పొరపాట్ల వల్ల జుట్టు రాలుతుందని మీకు తెలుసా ?

Hair Loss: ప్రతి ఒక్కరూ నల్లటి, పొడవాటి జుట్టును కోరుకుంటారు. జుట్టు పొడవుగా ఉంటే అది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ ప్రస్తుతం చాలా మంది బట్టతల సమస్యను ఎదుర్కుంటున్నారు. జుట్టు రాలడం అనేది సాధారణమే అయినప్పటికీ ..జుట్టు ఎక్కువ మొత్తంలో రాలిపోతే అది ఆందోళన కలిగించే అంశం అనే చెప్పాలి.


జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, రాత్రి నిద్రపోయేటప్పుడు మనం చేసే కొన్ని తప్పుల వల్ల కూడా రాలడం మొదలవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, జుట్టు రాలడాన్ని తగ్గించే మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దిండు యొక్క రాపిడి: కాటన్ పిల్లో జుట్టుపై ఒత్తిడికి కారణమవుతుంది. దీని కారణంగా జుట్టు బలహీనంగా మారడంతో పాటు చిట్లిపోతుంది.


హైడ్రేషన్ లేకపోవడం: తేమ లేకపోవడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి.

ఓపెన్ హెయిర్ : నిద్రిస్తున్నప్పుడు ఓపెన్ హెయిర్ చిక్కుకుపోతుంది. ఫలితంగా జుట్టు చిట్లిపోయే ప్రమాదం పెరుగుతుంది.

ఒత్తిడి: మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తుంది. అందుకే వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

అసమతుల్య పోషణ:  విటమిన్లు, సరైన ప్రోటీన్లు లేకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. సరైన పోషకాహారం తీసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుంది.

రాత్రి పడుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలదు..

సిల్క్ లేదా శాటిన్ పిల్లో కవర్‌లను ఉపయోగించండి – ఇవి జుట్టుపై రాపిడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా జుట్టు డ్యామేజ్ కాకుండా చేస్తుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది.

మీ జుట్టును ముడి వేసుకుని నిద్రించండి – మహిళలు మీ జుట్టును వదులుగా అలాగే వదిలేయకుండా జడ, లేకా బ్యాండ్ వేయండి. ఇవి జుట్టు చిక్కులు పడకుండా చేస్తాయి. అంతే కాకుండా రాత్రంతా జుట్టుకు రక్షణనిస్తాయి.

కొబ్బరి, ఆలివ్ నూనె రాయండి- పడుకునే ముందు ఆలివ్ నూనెను జుట్టుకు తేలికగా మసాజ్ చేయండి . ఇది జుట్టుకు పోషణనిస్తుంది. అంతే కాకుండా స్కాల్ప్‌ను హైడ్రేట్‌గా ఉంచుతుంది. తద్వారా మీ జుట్టును బలపరుస్తుంది. కొబ్బరి నూనె జుట్టును పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది.

Also Read: హెయిర్ కలర్ అవసరమే లేదు.. ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారిపోవడం పక్కా !

జుట్టును శుభ్రంగా, హైడ్రేటెడ్ గా ఉంచండి – మాయిశ్చరైజింగ్ హెయిర్ సీరమ్ ఉపయోగించండి. తద్వారా జుట్టు తేమగా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు పొడిబారకుండా, చివర్లు చిట్లకుండా ఉంటుంది.

ఒత్తిడి నిర్వహణ- మెడిటేషన్ , యోగా వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఎందుకంటే జుట్టు రాలడానికి ఒత్తిడి ఒక ప్రధాన కారణం.

తడి జుట్టుతో ఎప్పుడూ నిద్రపోకండి – రాత్రి పడుకునే ముందు మీ తడి జుట్టును ఆరబెట్టండి. ఎందుకంటే తడి జుట్టు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశం ఉంటుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×