Tips For Applying Henna: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. తెల్ల జుట్టు మన అందాన్ని తగ్గిస్తుంది. దీంతో ఈ సమస్య నుండి బయట పడేందుకు చాలా మంది హెన్నా లేదా హెయిర్ కలర్‌లను తరచుగా వాడుతుంటారు. కానీ హెన్నా అయినా, హెయిర్ డై అయినా జుట్టుకు ఎక్కువ కాలం ఉండదు.
ప్రతి 15 లేదా 20 రోజులకు ఒకసారి జుట్టుకు రంగు లేదా హెన్నా వేస్తూ ఉండాలి. మరి హెన్నా ,హెయిర్ డై ఎక్కువ కాలం జుట్టుకు ఉండాలంటే ఏం చేయాలి. వీటిని ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెన్నాలో రసాయనాలు:
చాలా మంది మార్కెట్లో దొరికే హెన్నాను జుట్టుకు వాడుతుంటారు. ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి. హెన్నా పొడి వాడటం వల్ల జుట్టు పొడిబారుతుంది. అంతే కాకుండా హెన్నా వాడటం వల్ల కొందరి జుట్టు కూడా రాలుతుంది. చాలా మంది హెన్నాను తెల్ల జుట్టుకు అప్లై చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇది ఎక్కువ కాలం పాటు ఉండదు.
రసాయనాలు కలిపిన హెన్నా పౌడర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అంతే కాకుండా హెన్నాతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టు కూడా దెబ్బతింటుంది.
బ్లాక్ హెన్నా చాలా హానికరం:
బ్లాక్ హెన్నా జుట్టుకు అత్యంత హానికరం. దీనిని ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖం , మెడ నల్లగా మారడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే రసాయనాలు జుట్టు రాలేందుకు కారణం అవుతాయి. తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు బ్లాక్ హెన్నా ఉపయోగించడం వల్ల తాత్కాలికంగా జుట్టు నల్లగా మారినప్పటికీ దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి.
జుట్టుకు సహజ హెన్నా ఉత్తమమైంది:
ఎన్నో ఏళ్లుగా జుట్టుకు హెన్నా ఉపయోగిస్తున్నారు. సహజ హెన్నా జుట్టుకు ఎటువంటి నష్టం కలిగించదని నమ్ముతారు. అంతే కాకుండా హెన్నా జుట్టును మృదువుగా , బలంగా చేస్తుందని చెబుతారు. హెన్నాలో ఉండే టానిన్ జుట్టును బలపరుస్తుంది. చాలా మంది మహిళలు హెన్నాను కండిషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. రసాయనాలు కలపని హెన్నా జట్టుకు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. మీకు కావాలంటే హెన్నా ఎరుపును తగ్గించడానికి కాఫీ, ఉసిరి వంటివి కలిపి జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇదే కాకుండా మీరు మార్కెట్లో లభించే హెర్బల్ హెన్నాను కూడా ఉపయోగించవచ్చు. ఇది 100 శాతం సేంద్రీయమని చెప్పబడుతుంది.
హెయిర్ కలర్ జుట్టును దెబ్బతీస్తుంది:
హెయిర్ డై వల్ల కలిగే ఏకైక ప్రయోజనం ఏమిటంటే అది మీ జుట్టును తక్కువ సమయంలోనే నల్లగా మారుస్తుంది. అంతే కాకుండా ఇది హెన్నా కంటే ఎక్కువ కాలం ఉంటుంది. దీని వల్ల కలిగే నష్టాల గురించి మనం మాట్లాడుకుంటే గనక ప్రయోజనాల కంటే చాలా ఎక్కువ. క్రమం తప్పకుండా జుట్టుకు హెయిర్ కలర్ అప్తై చేయడం వల్ల అలెర్జీలు, జుట్టు రాలడం, లూపస్, ఆస్తమా, నాన్-హాడ్జికిన్ లింఫోమా (ఒక రకమైన క్యాన్సర్) , జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి కూడా జరుగుతాయి. ఇదే కాకుండా రంగులు కూడా జుట్టును పూర్తిగా డ్యామేజ్ చేస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. మీరు కూడా మీ జుట్టుకు క్రమం తప్పకుండా హెయిర్ కలర్ వేసుకుంటే మాత్రం అది మీ జుట్టు మూలాలకు కాకుండా మీ జుట్టుకు మాత్రమే అప్తై చేయండి.
Also Read: తెల్లజుట్టు నల్లగా మార్చడానికి.. వీటిని మించినది లేదు !
PPD ,ఇండిగో రంగులు వాడటం మానుకోండి:
PPD అంటే p-ఫెనిలెన్డియమైన్ రంగును ఎక్కువ కాలం పోకుండా ఉపయోగిస్తారు. మార్కెట్లో లభించే 75 శాతం హెయిర్ డైలలో ఈ రసాయనం ఉంటుంది. దీనివల్ల చర్మం ,ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి, PPD , ఇండిగో ఉన్న రంగులను అస్సలు ఉపయోగించకూడదు.
సహజ హెయిర్ కలర్స్ వాడండి:
మీ జుట్టు చాలా తెల్లగా ఉంటే, జుట్టుకు రంగు వేయాలనుకుంటే, మీరు మార్కెట్లో లభించే సహజ హెయిర్ కలర్స్ ఉపయోగించవచ్చు. మీరు 100 శాతం ఆర్గానిక్ అని లేబుల్ చేయబడిన హెయిర్ డైలను ఉపయోగించవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.