BigTV English

Tirupati hunger strike: తిరుపతిలో సాధువుల ఆమరణ దీక్ష.. ముంతాజ్ హోటల్ నిర్మాణం ఆపాలంటూ

Tirupati hunger strike: తిరుపతిలో సాధువుల ఆమరణ దీక్ష.. ముంతాజ్ హోటల్ నిర్మాణం ఆపాలంటూ

Tirupati hunger strike: తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్షకు దిగారు.టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టారు.అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం జరుగుతోంది. హోటల్‌కు సంబంధించిన నిర్మాణాలను ఆపాలంటూ కొంత కాలంగా శ్రీనివాసనంద స్వామి పోరాటం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శ్రీనివాసానంద స్వామి ఆధ్వర్యంలో 150 మంది సాదువులు దీక్షకు దిగారు.


ప్రభుత్వం హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందంటూ వార్తలు రావడంతో మరోసారి ఆందోళనకు దిగారు. గతంలో వ్యతిరేకించిన కూటమి..ఇప్పుడెలా అనుమతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వామీజీలు. టూరిజం శాఖ అత్యుత్సాహంతో నిర్మాణాలు జరుగుతున్నాయని అంటున్నారు.

వారాహీ డిక్లరేషన్ అంటే ఇదేనా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షణ అంటున్న ఆయన, ఈ విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.తిరుమల ప్రక్షాళన అన్న సీఎం చంద్రబాబు, దీనికి సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ని స్వామిజీలు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ఫోటోలతో సీజ్ ద ముంతాజ్ హోటల్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. భక్తులను అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


ఈ వ్యవహారంపై శ్రీనివాసానంద స్వామి నోరు విప్పారు. ముంతాజ్ హోటల ఆపాలంటూ ప్రభుత్వానికి సీఎం, డిప్యూటీ సీఎంలకు వినతి పత్రాలు అందజేశామన్నారు. మూడు నెలలుగా శాంతియుతంగా పోరాటాలు చేశామన్నారు. హిందువులకు న్యాయం జరుగుతుందని భావించామని, చివరకు ఆమరణ దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు.

ALSO READ:  జగన్‌ని ‘మద్యం’ మింగిస్తోందా.. సీబీఐ, ఈడీ దిగడం ఖాయమా?

ఏడు కొండల చుట్టూ రుషులు తపస్సు చేసిన ప్రాంతమన్నారు. అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి హోటల్ నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. ఇంటి ముందు ఇలాంటివి చేస్తే అంగీకరిస్తారా? అంటూ ప్రశ్నించారు శ్రీనివాసానంద స్వామి. తాము హోటల్ వద్దని అనడం లేదని, వేరు ప్రాంతాలు ఉన్నాయన్నారు.

బ్రిటీషర్స్ కూడా ఇలాంటి పనులు చేయలేదన్నారు స్వామి. ఏడు కొండల చుట్టూ సెవెన్ స్టార్ హోటల్ పెడతారా? ఇదేనా మీరు హిందువులకు ఇచ్చే కానుక అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.వెంకటేశ్వర పవిత్ర అంటే ఇదేనా? సనాతన ధర్మమంటూ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఆయన చేసిన మంచి పనికి మా ఆశీస్సులు ఉంటాయన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం అలిపిరి సమీపంలో దేవలోకం పేరుతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం 60 ఎకరాలు కేటాయించింది. 2019 అధికారం మారిన తర్వాత వైసీపీ సర్కార్.. దేవలోకం ప్రాజెక్ట్‌కు కేటాయించిన 60 ఎకరాల్లో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి మంజూరు చేసింది.

ప్రభుత్వం మారిన తర్వాత ముంతాజ్ హోటల్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రద్దు చేయాలని తీర్మానించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ పాలక మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. హోటల్ నిర్మాణం చేయనున్న స్థలాన్ని మళ్లీ టీటీడీకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. దీని బదులుగా మరో దగ్గర స్థలం ఇస్తామని చెప్పిన విషయం తెల్సిందే.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×