BigTV English

Tomato and Potato Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

Tomato and Potato Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

Tomato and Potato Face Pack: బంగాళదుంప, టమాటోలను ప్రతి ఇంట్లో వంటల్లో ఉపయోగిస్తుంటారు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఇవి శరీర ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. బంగాళాదుంప, టమాటో రెండూ ముఖంపై ఉన్న మృతకణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మ రంగును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.


బంగాళదుంప ప్రయోజనాలు..

ఫ్రీ రాడికల్స్ : బంగాళదుంపలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా ముడతలను తగ్గిస్తుంది.


చర్మాన్ని కాంతివంతం చేస్తుంది: బంగాళదుంపలలో ఉండే కాటెకోలేస్ అనే ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాచయపడుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మంటను తగ్గిస్తుంది: బంగాళాదుంపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై ఉండే వాపు, ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మొటిమలు, తామర వంటి వాటిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

జిడ్డు చర్మాన్ని నియంత్రిస్తుంది: బంగాళాదుంపలలో పిండి పదార్ధం ఉంటుంది. ఇది ఫేస్‌పై ఉన్న అదనపు నూనెను గ్రహించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది జిడ్డు చర్మం ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

టమాటో యొక్క ప్రయోజనాలు..

లైకోపీన్ సమృద్ధిగా ఉంటుంది: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది: టమాటోలో విటమిన్ ఎ , సి ఉన్నాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా చర్మం దృఢంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

మొటిమలను తగ్గిస్తుంది: టమాటోలో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: టమాటోలో సహజమైన నూనెలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి.

బంగాళదుంపలు, టమోటాలు ముఖానికి ఎలా ఉపయోగించాలి ?

బంగాళదుంప రసం: బంగాళాదుంపను తురుము కొని దాని రసాన్ని తీయండి. ఆ తర్వాత కాటన్ తో ఈ రసాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

టమాటో రసం: 1 టమాటోను తీసుకుని గ్రైండ్ చేసి రసాన్ని తీయండి. దీన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Also Read: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

ఫేస్ మాస్క్:
బంగాళదుంపల జ్యూస్ – 1 టీ స్పూన్
టమాటో పేస్ట్- 1 టేబుల్ స్పూన్
పెరుగు -1 టీ స్పూన్
తేనె- 1 /2 టీ స్పూన్
శెనగపిండి- 1టేబుల్ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో బంగాళదుంపలు, టమాటోలను పెరుగు, తేనె, శెనగపిండిలను ఒక బౌల్ లో తీసుకుని బాగా కలుపుకోవాల. ఇలా తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. దీనిని వారానికి 2-3 సార్లు ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. చర్మ సమస్యలు కూడా చాల వరకు తొలగిపోతాయి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×