BigTV English
Advertisement

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Bigg Boss 8 Day 21 Promo.. నిన్నటి ఎపిసోడ్ తో ఆడియన్స్ పూర్తిస్థాయిలో నిరాశ పడ్డారని చెప్పవచ్చు.
ముఖ్యంగా అభయ్(Abhay ) బిగ్ బాస్ (Bigg Boss) ను అగౌరవపరుస్తూ చేసిన కామెంట్స్.. ప్రోమోలో చూపించిన తీరు .. నాగార్జున (Nagarjuna) ఓవరాక్షన్ అన్నీ కూడా ఆడియన్స్ లో ఆసక్తి పెంచేసాయి. అయితే అందరి అంచనాలను బోల్తా కొట్టిస్తూ ఎపిసోడ్లో ఏమీ అక్కడ చూపించకపోవడంతో ఆడియన్స్ అంతా నిరాశపడ్డారు. ఇక అయితే ఇప్పుడు మరొకసారి నిన్నటిలా ఉండదు అంటూ సండే ఫన్ డే అంటూ ప్రోమోతో వచ్చేసారు. అయితే ఈసారి ఈ సండే ఫండే లో భాగంగా సెట్ ఆర్ కట్ అనే ఆట ఆడించారు నాగార్జున.


సెట్ ఆర్ కట్..

ప్రోమో విషయానికి వస్తే.. పృథ్వీ ఏంటి.. ఈరోజు ఎనర్జిటిక్ గా ఉన్నాడు అని నాగార్జున అనగానే.. వెంటనే విష్ణు ప్రియ.. సార్ ఈరోజు ఇతను ఎనర్జిటిక్ గా ఉన్నాడు కానీ ఇతడు వేసుకున్న షర్టు ఇతనిది కాదు అంటూ చెప్పింది. ఎవరిది ఆ షర్ట్ అంటూ నాగార్జున అడగగానే.. నైకిల్ అంటూ అందరినీ నవ్వించింది విష్ణు ప్రియ. ఆ తర్వాత సెట్ ఆర్ కట్ అంటూ కంటెస్టెంట్స్ తో ఎవరితో సెట్ అయితే వారికి హార్ట్ ఇవ్వండి, కట్ అన్నవారికి ఆ హార్ట్ బ్రేక్ చేయండి అంటూ నాగార్జున చెబుతాడు. దీంతో నిఖిల్ హార్ట్ ను మొదట పృథ్వీ కి ఇచ్చి మాట వింటాడు అంటూ చెప్పుకొచ్చారు. సోనియాకి హార్ట్ బ్రేక్ చేశాడు. ఇక తర్వాత మణికంఠ సోనియాతో హార్ట్.. నిఖిల్ తో కట్ అంటూ చెప్పేశాడు. అంతేకాదు వీరు చెప్పే రీసన్స్ కి , నాగార్జున వేసే కౌంటర్ కి కూడా ఆడియన్స్ కి నవ్వొచ్చిందని చెప్పవచ్చు.


Bigg Boss 8 Day 21 Promo: Set or Cut.. Is it a real fun day..?
Bigg Boss 8 Day 21 Promo: Set or Cut.. Is it a real fun day..?

నైనిక తో నబీల్ బ్రేక్..

ఇక తర్వాత నబిల్ నైనికతో కట్ చెప్పేశాడు. అంతేకాదు నైనికా చూసే చూపులకు.. భయమేస్తోంది అలా చూడకు అంటూ అందరినీ నవ్వించాడు. ఈమె పెద్దగా మాట్లాడదు అంటూ కట్ చెప్పేశాడు. దీంతో నైనిక అది కూడా మాట్లాడను బ్రేక్ చెయ్ అంటూ నవ్వించేసింది. ఆ తర్వాత విష్ణు ప్రియ సెట్ సీతతో.. ఎందుకంటే మేమిద్దరం కృష్ణుడి భక్తులం అంటూ రీజన్ చెప్పింది. పృథ్వీతో బ్రేక్ చెప్పేసింది. ఇక తర్వాత ప్రేరణ అభయ్ తో సెట్ యష్మితో కట్ చెప్పేసింది. ఇలా ఒకరికొకరు సెట్, కట్ అంటూ బాగానే సెట్ లో అందరిని నవ్వించేశారు ఆడియన్స్ కి కూడా బాగానే ఈ ఎపిసోడ్ అనిపించింది మొత్తానికైతే ఈ సండే కాస్త రియల్ ఫన్డే అయిపోయిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఈ వారం అభయ్ ఎలిమినేట్ కాబోతున్నాడు. అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×