BigTV English

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Tomato Face Packs: టమాటోలను ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తాము . వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటోలు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. టమాటోలో ఉండే పోషకాలు చర్మానికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు తొలగిపోతాయి.


టమాటోతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం, మెరుస్తూ ఉంటుంది. మార్కెట్‌లో లభించే ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌కు బదులుగా ఇంట్లోనే టమాటో ఫేస్ ప్యాక్‌లను సులభంగా తయారు చేసుకోవచ్చు.

టమాటోలో ఉండే విటమిన్ సి, లైకోపీన్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా తగ్గిస్తుంది. టానింగ్‌ను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది.


టమాటాలతో 4 ఫేస్ ప్యాక్‌ల తయారీ..

1. టమాటో, పెరుగు ఫేస్ ప్యాక్:

కావలసినవి:

టమాటో-1

పెరుగు-2 టీ స్పూన్లు

తయారీ విధానం: ముందుగా ఒక పండిన టమాటోను ఒక బౌల్ లో తీసుకుని దానిని చేతులతో మెదిపి అందులో 2 చెంచాల పెరుగు వేసి కలపండి. ఆ తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ట్యానింగ్‌ను తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మం రంగును మెరుగుపరుస్తుంది.

2. టమాటో, తేనె ఫేస్ ప్యాక్:
కావలసినవి:
టమాటో- 1
తేనె-టీ స్పూన్

తయారీ విధానం: ఒక పండిన టమాటోను తీసుకుని మిక్సీ పట్టండి. ఈ పేస్ట్ లో 1 టీస్పూన్ తేనెను కలపండి. ఆ తర్వత దీనిని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలను తగ్గించి, చర్మాన్ని తేమగా చేయడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

3. టమాటో, శనగపిండి ఫేస్ ప్యాక్:
కావలసినవి:
టమాటో- 1
శనగపిండి- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ముందుగా ఒక పండిన టమాటోను తసుకుని మీక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కలపండి. తర్వాత దీనిని బాగా మాక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. అనంతరం 15-20 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.అంతే కాకుండా మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ కూడా చేస్తుంది.

Also Read: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

4. టమాటో, లెమన్ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
టమాటో పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం-1/2 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల టమాటో పేస్ట్ వేయాలి. అందులో నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ముఖానికి ముఖానికి పట్టించాలి. 10-15 నిమిషాల తర్వాత దీనిని కడిగేయాలి. : ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. తరుచుగా టమాటో తో చేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Early Skin Aging: చిన్న వయస్సులోనే.. ముఖంపై ముడతలు రావడానికి కారణాలేంటి ?

Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే !

Cancer Risk: గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారా ? ఈ వ్యాధి రావడం ఖాయం !

Obesity: మీరు చేసే.. ఈ పొరపాట్లే బరువు పెరగడానికి కారణమట !

Hemoglobin Deficiency: హిమోగ్లోబిన్ లోపమా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్

Myopia In Young Children: కాలుష్యంతో కంటి సమస్యలు.. పిల్లల్లో పెరుగుతున్న మయోపియా కేసులు !

Malida Laddu: బతుకమ్మ స్పెషల్ మలీద లడ్డూలు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Emergency Numbers:108 మాత్రమే కాదు! ప్రాణాలను కాపాడే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

Big Stories

×