BigTV English

Big fat Indian weddings: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్

Big fat Indian weddings: ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్

Big fat Indian weddings| ఇండియాలో ఎప్పుడూ డిమాండ్ ఉన్న బిజినెస్ లు మూడే. సినిమాలు, క్రికెట్, పెళ్లిళ్లు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పెళ్లిళ్ల మార్కెట్ ఇండియా. మంచి వివాహ ముహూర్తాలు ఉండడంతో మరో రెండు నెలల వరకు దేశంలో పెళ్లిళ్లు భారీ సంఖ్యలో ఉండబోతున్నాయి.


ఈ సంవత్సరం చివరి రెండు నెలలు.. నవంబర్, డిసెంబర్ లో 35 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రిపోర్ట్. అయితే గతేడాది చివరి రెండు నెలల్లో 32 లక్షల వివాహాలు జరిగాయి. అంటే ఈ సంవత్సరం ఈ సంఖ్య మూడు లక్షలకు పైగా పెరిగింది. కెయిట్ సర్వే రిపోర్ట్ ప్రకారం.. జనవరి 15, 2024 నుంచి జూలై 15 వరకు 42 లక్షల వివాహ వేడుకలు జరగగా.. వాటి వల్ల రూ.5.5 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది.

Also Read : గంటకు 250కిమి వేగంతో దూసుకోపోయే బుల్లెట్ ట్రైన్.. ఇండియాలో ఇదే ఫస్ట్!


దేశంలో పెళ్ళిళ్ల బిజినెస్ నిర్వహించే అతిపెద్ద కంపెనీ ‘బ్యాండ్ బాజా బారాత్ అండ్ మార్కెట్స్’ అంచనా ప్రకారం.. ఈ రెండు నెలల్లో పెళ్లిళ్ల బిజినెస్ రూ.4.25 లక్షల కోట్లు జరగబోతోంది. పెళ్లిళ్ల సీజన్ తో పాటు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో బంగారంపై దిగుమతి పన్ను 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు కూడా పెరిగాయని కూడా కంపెనీ తెలిపింది.

పెళ్లిళ్ల సీజన్ తో పాటు దసరా దీపావళ్లి, క్రిస్ మస్ పండుగలు ఉండడం వల్ల సంవత్సరం చివరి మూడు నెలల్లో బిజినెస్ లు బాగా జరిగి ఇండియన్ స్టాక్ మార్కెట్ మంచి బూస్ట్ లభిస్తుంది. జువెలరీ, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, పర్యాటక, రిటైల్ రంగంలో ఈ కాలంలో ప్రజలు బాగా ఖర్చు చేయడంతో దేశ ఆర్థిక వృద్ధి కూడా వేగం పుంజుకుంటుంది.

సాధారణంగా పెళ్లి జరిగితే.. ప్రజలు బట్టలు, బంగారు నగలు షాపింగ్ చేయడంతో పాటు పెళ్లిళ్లకు హోటల్స్ బుకింగ్స్ జరుగుతాయి. వీటితో పాటు ఇంటి రిపైర్స్, పెయింటింగ్ పనులు చేయిస్తారు. ఒకరికి మరొకరు కానుకలు ఇవ్వడంతో రిటైల్ ఫ్యాన్సీ సెక్టర్ లో కూడా మంచి బిజినెస్ జరుగుతుంది.

Also Read: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

భారతదేశంలో ప్రతీ సంవత్సరం దాదాపు కోటి వివాహాలు జరగుతాయి. ఈ పెళ్లిళ్లకు దాదాపు 130 బిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. వీటితో పాటు ఇతర దేశాల నుంచి డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం ఇండియా వస్తున్నారు. దీని వల్ల వచ్చే సంవత్సరం లక్ష కోట్ల బిజినెస్ జరగవచ్చనే అంచనా.

ఇండియాలో వివాహ రంగం ప్రస్తుతం నాలుగో అతిపెద్ద బిజనెస్ ఇండస్ట్రీగా ఉన్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయం.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×