Tomato Face Pack : అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. బయట రసాయనాలతో తయారు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల తాత్కాలికంగా మాత్రమే ముఖం అందంగా కనిపిస్తుంది. తర్వాత మామూలైపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న పదార్థాలతో ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకుని వాడాలి. ఇవి ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డును తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
టమాటోలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా డల్ నెస్‌ను తొలగిస్తాయి. తరుచుగా టమాటో రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా కూడా ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది. అందుకే ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమాటోతో ఫేస్ తయారు చేసుకుని వాడటం వల్ల గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు. మరి టమాటోతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టమాటో ఫేస్ ప్యాక్..
కావలసినవి:
టమాటో పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం-1 టీ స్పూన్
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో పైన చెప్పిన మోతాదుల్లో పదార్థాలను తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ ఫేస్ట్ ను ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత దీనిని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. ముఖంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది.
టమాటో, నిమ్మకాయలో ఉండే సహజమైన బ్లీచింగ్ గుణాలు ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగిస్తాయి. నిమ్మ కాయలో ఉండే విటమిన్ సి, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
2. టమాటో, పెరుగు ఫేస్ ప్యాక్..
కావలసినవి:
టమాటో పేస్ట్- 1 టేబుల్ స్పూన్
పెరుగు – 1 టేబుల్ స్పూన్
కొబ్బరి నూనె- 1 టీ స్పూన్
తయారీ విధానం:
ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో టమాటో, పెరుగు, కొబ్బరి నూనెలను తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. దీనిని ముఖానికి 15 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా మారుతుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మం అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.
Also Read: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది హైపర్ పిగ్మంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. తరుచుగా టమాటోతో ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల ముఖం అందంగా మెరుస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.