Big Stories

Beauty Tips: పుదీనా ఆకులతో అందమైన చర్మం మీ సొంతం..

Beauty Tips: ఇంట్లోని వంటలకు ఉపయోగించే కూరగాయలను కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కూరగాయల్లో ఆకుకూరలు ఆరోగ్యానికి. అందానికి చక్కగా పనిచేస్తాయి. అందులోను ముఖ్యంగా పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి పుదీనాతో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో అందానికి కూడా పుదీనా అదే విధంగా ఉపయోగపడుతుంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

పుదీనా శరీరంలోని అనారోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. పుదీనా ఆకుల వాసన మెదడులోకి నరాలను, శ్వాసనాలాలను ఉత్తేజపరచేందుకు తోడ్పడుతుంది. ఇది వాంతులు వంటి లక్షణాలు ఉన్న వారు ఉపయోగిస్తే చక్కటి మేలు జరుగుతుంది. అంతేకాదు పుదీనా ఆకులతో అనేక సమస్యలు, వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అయితే పుదీనా ఆకులను వేసవిలో వాడడం చాలా మంచిది అంటారు. వేసవిలో ఎక్కువగా తీసుకునే జ్యూస్ లలో పుదీనా ఆకులను వేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

- Advertisement -

పుదీనా ఆకులను వాడడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో ఉండే విటమిన్ ఏ,సీ,బీ6, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ చక్కగా తోడ్పడతాయి. పుదీనా నీటిని తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. పుదీనాను చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు కళ్ల కింద నల్ల మచ్చలు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. పుదీనా పేస్ట్ ను ముఖానికి పట్టించడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News