Big Stories

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు బిగ్ షాక్..!

Phone Tapping Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న నిందితుడు రాధాకిషన్ రావు బెయిల్ కోసం ఇటీవలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాధాకిషన్ రావు పిటిషన్ పై నాంపల్లి కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

- Advertisement -

రాధాకిషన్ బెయిల్ పిటిషన్ పై రిజర్వ్ చేసిన తీర్పును మే 2న కోర్టు వెల్లడించనుంది. రాధా కిషన్ రావుకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇప్పటికే రాధా కిషన్ రావు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. పోలీస్ కస్టడీ కూడా పూర్తయిందని కొర్టుకు ఉమామహేశ్వరావు తెలిపారు.

Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ

ఇటీవలే ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను కూడా నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో భాగంగా పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News