Brain Boosting Foods: మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఆహారం ఎంత ముఖ్యమో, మన మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా పోషకాలు అంతే అవసరం. ఆధునిక జీవితంలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపరచుకోవడం ఒక పెద్ద సవాలు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా.. మెదడు పనితీరును మెరుగుపరచవచ్చు. అంతే కాకుండా వయస్సు సంబంధిత క్షీణతను ఆలస్యం చేయవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని పెంచే 5 అద్భుతమైన ఆహారాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొవ్వు చేపలు – ఓమెగా-3 పవర్‌హౌస్:
సాల్మన్, ట్యూనా, సార్డిన్స్ వంటి కొవ్వు చేపలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడులో 60% కొవ్వు పదార్థాలతో నిండి ఉంటుంది. అంతే కాకుండా అందులో ఒమెగా-3 అనేది ఒక కీలకమైన భాగం. ముఖ్యంగా DHA (డాకోసాహెక్సానోయిక్ యాసిడ్) జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడంలో.. అలాగే అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. వారానికి కనీసం రెండు సార్లు కొవ్వు చేపలను తినడం వలన మెదడుకు కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.
2. బెర్రీస్: (యాంటీ ఆక్సిండెంట్స్):
బెర్రీలల్లో ఫ్లేవనాడ్లు ఉంటాయి. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల మధ్య సంభాషణలను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. మెదడులోని వాపు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా క్రమం తప్పకుండా బెర్సీస్ తీసుకోకుండా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి
పదునుగీ ఉంచడానికి మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
3. పసుపు – రోగ నిరోధక శక్తి
మనం ప్రతి రోజు వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. దీనిలో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. కర్కుమిన్ అనేది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహించే BDNF స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. పసుపును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం లేదా పసుపు పాలను తాగడం వలన జ్ఞాపకశక్తి ఏకాగ్రత మెరుగుపడతాయి.
4. గుమ్మడి గింజలు – సూక్ష్మ పోషకాల నిలయం:
గుమ్మడి గింజలు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ.. మెదడు ఆరోగ్యానికి కీలకమైన జింక్, మెగ్నీషియం, రాగి, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు మూలం. జింక్ జ్ఞాపకశక్తికి ,నరాల సంకేతాలను అందించడానికి చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. గుమ్మడి గింజలను స్నాక్స్‌గా లేదా సలాడ్‌లపై చల్లుకుని తినడం ఉత్తమం.
5. డార్క్ చాక్లెట్ – మెదడుకు ట్రీట్:
డార్క్ చాక్లెట్‌లో (కనీసం 70% కోకో ఉన్నది) ఫ్లేవనాయిడ్లు, కెఫీన్, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్లు మెదడులోని జ్ఞాపకశక్తి, నేర్చుకునే ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. అంతేకాకుండా… కొద్దిపాటి కెఫీన్ తక్షణ ఏకాగ్రత, చురుకుదనాన్ని పెంచుతుంది. రోజుకు కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం వలన మీ మానసిక స్థితి మెరుగుపడి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ఈ ఐదు మెదడు-బూస్టింగ్ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీ మెదడు శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మంచి ఆహారంతో పాటు, సరిపడా నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి కూడా మెదడు పనితీరును మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన మెదడు కోసం నేటి నుంచే మీ ఆహారంలో ఈ మార్పులు చేయడం ప్రారంభించండి.