Oils For Skin Glow: చలికాలంలో అనేక చర్మ సమస్యలు ఎదురవుతాయి. చల్లని గాలితో పాటు తక్కువ తేమ కారణంగా ఈ సీజన్‌లో చర్మం పొడిగా మారడంతో పాటు నిస్తేజంగా తయారవుతుంది. కానీ భయపడాల్సిన పని లేదు. కొన్ని ప్రత్యేకమైన ముఖ్యమైన నూనెల సహాయంతో మీరు శీతాకాలంలో కూడా మీ చర్మాన్ని మెరిసేలా ఉంచుకోవచ్చు. ఈ నూనెలు చర్మానికి పోషణను అందించడమే కాకుండా సహజ కాంతిని కూడా అందిస్తాయి.
శీతాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి 5 ముఖ్యమైన నూనెలను ఉపయోగపడతాయి. మరి ఏ నూనెలు గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడతాయి. వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెరిసే చర్మం 5 బెస్ట్ ఆయిల్స్:
లావెండర్ ఆయిల్: లావెండర్ ఆయిల్ మంచి సేవాసనను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటిసెప్టిక్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మపు చికాకు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. నిద్రపోయే ముందు ప్రతి రోజు బాదం నూనె లేదా జోజోబా ఆయిల్ వంటివి కొద్ది మొత్తంలో తీసుకుని వాటికి లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది.
యూకలిప్టస్ ఆయిల్: యూకలిప్టస్ ఆయిల్ యాంటిసెప్టిక్ లో యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. అంతే కాకుండా మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ చర్మంపై కలిగే మంటలను కూడా తగ్గిస్తుంది.
రోజ్మేరీ ఆయిల్ : రోజ్మేరీ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం యొక్క ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా వృద్ధాప్యాన్నినెమ్మదిగా చేస్తాయి. అంతే కాకుండా ఈ ఆయిల్ ముఖానికి అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మానికి మరింత ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఫలితంగా స్కిన్ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. రోజ్మేరీ ఆయిల్ చర్మాన్ని టోన్ చేస్తుంది.
జోజోబా ఆయిల్: జోజోబా ఆయిల్ చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మంలో తేమను నిలుపుకుని పొడిబారకుండా చేస్తుంది. జోజోబా నూనె చర్మం యొక్క సహజ నూనెను పోలి ఉంటుంది. అందువల్ల ఇది చర్మాన్ని అంటుకోకుండా పోషణను అందిస్తుంది. ఇది అన్ని చర్మ రకాలకు మంచిది.
ఆముదం: ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా మార్చడంతో పాటు మృదువుగా చేస్తుంది. ఇది చర్మ కణాలను పునరుజ్జీవింపజేసి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఆముదం చర్మం ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
నూనెలను ఎలా ఉపయోగించాలి ?
క్యారియర్ ఆయిల్స్‌తో మిక్స్ చేయండి – ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. క్యారియర్ ఆయిల్‌తో (బాదం నూనె, జోజోబా నూనె, కొబ్బరి నూనె వంటివి) కలపడం ద్వారా దీన్ని ఎల్లప్పుడూ ఉపయోగించండి.
ప్యాచ్ టెస్ట్ చేయండి- ఏదైనా కొత్త ఆయిల్ ఉపయోగించే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేయడం ముఖ్యం. మీకు ఎలాంటి అలర్జీ లేదని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
రాత్రి పూట ఉపయోగించండి – నిద్రపోయే ముందు, క్యారియర్ ఆయిల్‌లో కొద్ది మొత్తంలో ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి.
Also Read: ఇలా చేస్తే.. పొడవాటి, ఒత్తైన జుట్టు గ్యారంటీ !
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి:
పుష్కలంగా నీరు త్రాగాలి – చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగడం చాలా ముఖ్యం .
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి- పండ్లు, కూరగాయలు , ఆకు కూరలు తినండి. ఇవి చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి.
ఒత్తిడిని తగ్గించండి- ఒత్తిడి చర్మాన్ని దెబ్బతీస్తుంది. యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలు చేయండి.