Healthy Hair Tips: చలికాలంలో ఆరోగ్యంతో పాటు జుట్టు కూడా చాలా సమస్యలను ఎదుర్కుంటుంది. ఈ సీజన్‌లో గాలిలో తేమ కారణంగా, జుట్టు తరచుగా పొడిగా మారడంతో పాటు నిర్జీవంగా కూడా తయారవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, శీతాకాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా జుట్టు వాష్ చేసే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.
తలస్నానం చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ !
చలికాలం రాగానే ఆరోగ్యంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు అనారోగ్యానికి గురవుతారు. అంతే కాకుండా గాలిలో తేమ లేకపోవడం వల్ల జుట్టు నుండి చర్మం వరకు ప్రతిదీ పొడిగా మారడం ప్రారంభమవుతుంది.
వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇది చుండ్రుతో పాటు జుట్టు రాలడాన్ని కూడా పెంచుతుంది. ఫలితంగా జుట్టు దాని మెరుపును కోల్పోతుంది. అంతే కాకుండా.. జుట్టు బలహీనంగా మారడంతో పాటు పొడిగా తయారవుతుంది. తలలో తేమ తక్కువగా ఉండటం వల్ల దురద వస్తుంది.
1.శీతాకాలంలో జుట్టు ఆరోగ్యంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు గుడ్లు, ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్ , ఉసిరి, నారింజ మొదలైనవి తీసుకోవాలి. దీంతో పాటు, శీతాకాలంలో మీ జుట్టును వాష్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోండి. తద్వారా జుట్టు మందంగా, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది. చలికాలంలో జుట్టును వాష్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2.ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి:
బృంగరాజ్,బాదం,ఆవాలు లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు మసాజ్ చేయండి. ఇది పొడిన జుట్టు సమస్యను తొలగిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.ఇది జుట్టును బలపరుస్తుంది.
3.హెయిర్ మాస్క్‌లను ఉపయోగించండి. పెరుగులో నిమ్మ రసంతో పాటు ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి పది నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది పొడి జుట్టుకు తేమను అందిస్తుంది. ఫలితంగా జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టుకు పోషణను కూడా అందిస్తుంది.
4.శీతాకాలంలో, ప్రజలు తరచుగా తమ జుట్టును వేడి నీటితో వాష్ చేస్తుంటారు కానీ వేడి నీరు జుట్టు నుండి తేమను వేగంగా గ్రహిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని పెంచుతుంది. అందువల్ల మీ జుట్టును సాధారణ నీటితో మాత్రమే కడగడానికి ప్రయత్నించండి. నీరు చాలా చల్లగా ఉంటే గోరువెచ్చని నీటిని కూడా వాడండి.
5.జుట్టు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే శీతాకాలంలో కండీషనర్ తప్పకుండా వాడండి. శీతాకాలంలో జుట్టు బలహీనంగా మారుతుంది. ఫలితంగా జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో జుట్టు ఆరబెట్టడాన్ని నివారించండి. గాలికే జుట్టుకు ఆరనివ్వండి. స్ట్రెయిటెనింగ్, రీబాండింగ్ లేదా ఏదైనా రకమైన హీట్ ట్రీట్‌మెంట్ వంటి స్టైలింగ్‌ను నివారించండి. ఈ సమయంలో, డిజైనర్ బ్రెయిడ్, హెయిర్ ట్విస్ట్ లేదా బన్ వంటి హెయిర్ స్టైలింగ్ లు చేయకుండా ఉండండి.
Also Read: ఇంట్లోనే బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్టండిలా !
6.నిద్రపోయేటప్పుడు శాటిన్ లేదా సిల్క్ పిల్లో కవర్లను ఉపయోగించండి. దీని కారణంగా, నిద్రలో జుట్టు ఎలాంటి డ్యామేజ్ జరగదు. అంతే కాకుండా రాలకుండా కూడా ఉంటుంది.
7.నిద్రపోయే ముందు మీ జుట్టుకు నూనె అప్లై చేయండి. ఇది తేమను లాక్ చేస్తుంది. ఫలితంగా మీ జుట్టు బలహీనంగా, మారకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.