Malaika Arora: మమూలుగా బాలీవుడ్‌లో డేటింగ్ కల్చర్ ఎక్కువ అని, ఏ ప్రేమజంట కూడా పెళ్లి చేసుకోదు అని.. ఇలా ప్రేక్షకుల్లో చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ కపుల్సే లవ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా కలిసుంటున్నారు. అలాగే మలైకా అరోరా (Malaika Arora), అర్జున్ కపూర్ (Arjun Kapoor) పీకల్లోతు ప్రేమలో ఉండడం చూసి చాలామంది ప్రేక్షకులు.. వీరు కూడా ప్రేమ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారని ఫీలయ్యారు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని నిలబడినా ఈ ప్రేమజంట కూడా బ్రేకప్ అంటూ విడిపోయి అందరికీ షాకిచ్చింది. దీంతో వీరి మధ్య ఏం జరిగిందో చెప్పకుండానే ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో హింట్స్ ఇస్తుంటుంది మలైకా అరోరా.
బ్రేకప్ అయ్యిందిగా
దాదాపు అయిదేళ్లకు పైగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్నారు. అర్జున్ కపూర్.. మలైకా కంటే వయసులో చిన్నవాడే అయినా కూడా ఆ తేడా వారిని ప్రేమలో పడకుండా ఆపలేకపోయింది. వీరు ప్రేమలో ఉన్నప్పుడు కూడా చాలామంది వీరి వయసులో ఉన్న వ్యత్యాసం గురించి నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. అయినా ఈ జంట మాత్రం పట్టించుకోకుండా విమర్శించిన వారికే రివర్స్ కౌంటర్స్ ఇచ్చేది. దీంతో వీరి ప్రేమ చాలా బలమైనది అని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇంతలోనే తమకు బ్రేకప్ అయ్యిందని ప్రకటించాడు అర్జున్ కపూర్. అప్పటినుండి మలైకా పెట్టే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు అన్నీ అర్జున్‌కు సందేశాలలాగా అనిపిస్తుంటాయి.
Also Read: నేనే కరణ్ జోహార్‌కు ఆఫర్ ఇస్తానంటున్న కంగనా.. పాత గొడవలు మర్చిపోయారా.?
అర్జునే ముందుగా
తాజాగా ‘నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటే ఉండు’ అని అర్థం వచ్చే కోట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది మలైకా అరోరా. ఇది చూసిన ఫాలోవర్స్.. తనను తాను సంతోషంగా ఉండాలని ప్రిపేర్ చేసుకుంటుందా లేక అర్జున్ కపూర్ సంతోషంగా ఉండాలని అనుకుంటుందా అర్థం కావడం లేదే అంటూ సందేహంలో పడ్డారు. అసలైతే వీరిద్దరూ విడిపోయారనే విషయం అర్జున్ వల్లే బయటికి వచ్చింది. ఒక ఈవెంట్‌లో పాల్గొన్న అర్జున్ కపూర్.. మలైకా అరోరా గురించి చెప్పమని అడగగా.. తాను ఇప్పుడు సింగిల్ అని అందరి ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కానీ మలైకా మాత్రం నేరుగా బ్రేకప్ గురించి ఏం చెప్పకుండా ఇలా ఇన్‌డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలతోనే హింట్ ఇచ్చేస్తోంది.
బాధతో అయ్యిండొచ్చు
మామూలుగా మలైకా అరోరాకు తనకు నచ్చే కోట్స్‌ను ఇన్‌స్ట్రాగామ్ స్టోరీల్లో షేర్ చేసుకోవడం ఇష్టం. కానీ ఇప్పుడు తనకు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ అయ్యింది కాబట్టి తను పెట్టే ప్రతీ కోట్‌ను అర్జున్‌తోనే రిలేట్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. తాజాగా సంతోషం గురించి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫాలోవర్స్ మరొక అర్థాన్ని కూడా వెతుక్కుంటున్నారు. తనతో విడిపోయి అర్జున్ కపూర్ సంతోషంగా ఉన్నాడని మలైకా అనుకుంటుందని, అందుకే అలా ఉండు అని ఇన్‌డైరెక్ట్‌గా తన బాధ గురించి చెప్పుకుంటుందని కూడా అనుకుంటున్నారు. తన మొదటి భర్తతో విడిపోయిన తర్వాత చాలాకాలం మలైకా సింగిల్‌గానే ఉంది. అప్పుడే అర్జున్‌తో ప్రేమలో పడింది.