Heart Attack: ఇప్పుడున్న రోజుల్లో ఎప్పుడు ఏంజరుగుతుందో అర్ధంకానీ పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి వస్తారన్న నమ్మకం రోజురోజుకి తగ్గిపోతుంది. కాలక్రమేణా వెళ్తున్న మార్గంలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ రావడం కామన్ అయిపోయింది. తాజాగా ఎనిమిదేళ్ల బాలిక పాఠశాల ప్రాంగణంలోనే గుండెపోటుతో మరణించింది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో గార్గి అనే విద్యార్ధిని మూడవ తరగతి చదువుతుంది. రోజూవారిలాగే స్కూల్‌కి వచ్చిన బాలిక.. పాఠశాలకు రావడంతోనే ఛాతి నొప్పి అంటూ టీచర్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రిషప్షన్ దగ్గర కుర్చీలో కూర్చున్న గార్గి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గార్గి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిజానికి బాలిక అవస్థకు గురై.. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు.. సీసీ కెమరాలో రికార్డయిన వీడియోలో చూడవచ్చు. ఇక గార్గి సాధారణ వ్యాధులకు మించి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి లేవని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
క్లాస్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురైన మూడో తరగతి విద్యార్థిని గార్గి
గుండెపోటుతో చైర్ లో ఒక్కసారిగా కుప్పకూలిన గార్గి
సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీ కెమెరా దృశ్యాలు pic.twitter.com/xTBdQ23Czj
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025