Buying Mango: సమ్మర్‌లో మామిడి పండ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే రసాయనాలతో పండించిన మామిడి పండ్లు కూడా మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడవుతుంటాయి.
వేసవి కాలం ప్రారంభమైన వెంటనే.. మార్కెట్‌లోకి మామిడి పండ్లకి కొదవుండదు. తియ్యటి, జ్యూసీ మామిడి పండ్లను కొనుగోలు చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే కొంత మంది వ్యాపారులు రసాయనాలను మామిడి పండ్లను పండించడానికి ఉపయోగిస్తుంటారు. మామిడి పండ్లను త్వరగా పండించడానికి కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా చాలా హానికరం.
రసాయనాలతో పండించిన మామిడి పండ్లు మెరుస్తూ ఉంటాయి. కానీ అవి శరీరానికి విషం లాంటివి. అటువంటి మామిడి పండ్లు తినడం వల్ల తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి , క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి.. మార్కెట్ నుండి మామిడి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. 5 సులభమైన పద్ధతుల సహాయంతో మీరు రసాయనికంగా పండించిన మామిడి పండ్లను గుర్తించవచ్చు.
మామిడిపండు రంగు:
మామిడి పండు మెరుస్తూ, మృదువుగా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. రసాయనికంగా పండించిన మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్ ప్రభావంతో అసాధారణంగా మెరుస్తుంటాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా పండిన మామిడి కొంచెం నిస్తేజంగా, తక్కువ మెరుస్తూ కనిపిస్తుంది. రసాయనాల సహాయంతో పండించిన మామిడి మాత్రమే పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తుంది.
వాసనను గుర్తించండి:
సహజంగా పండిన మామిడి పండ్లు తియ్యటి, రిఫ్రెషింగ్ సువాసనను అందిస్తాయి. ఇదిలా ఉంటే..రసాయనాలను ఉపయోగించి పండించిన మామిడి పండ్లకు ప్రత్యేకమైన వాసన ఉండదు లేదా తేలికపాటి రసాయనాల వాసన ఉంటుంది. మీరు మామిడి పండును వాసన చూసేటప్పుడు బలమైన రసాయన వాసన వస్తే.. దానిని రసాయనాలను ఉపయోగించి పండించారని అర్థం చేసుకోండి.
నొక్కినప్పుడు ఆకృతి:
రసాయనాలు లేకుండా పండిన మామిడిపండు కొద్దిగా మృదువుగా ఉంటుంది. తాకినప్పుడు కొద్దిగా ఒత్తిడిని ఇస్తుంది. కానీ రసాయనాలను ఉపయోగించి పండించిన మామిడి పండ్లు బయటి నుండి మృదువుగా , లోపల నుండి పచ్చిగా ఉంటాయి. వాటిని నొక్కినప్పుడు ఒక వింతైన స్పాంజి లాంటి అనుభూతి కలుగుతుంది. మామిడికి ఏకరీతి మృదుత్వం లేకపోతే.. అది సహజమైనది కాదు.
రంగు:
సహజంగా పండిన మామిడి పండ్లు క్రమంగా రంగు మారతాయి. లేత పసుపు నుండి ఆకుపచ్చ వరకు పాచెస్ కలిగి ఉంటాయి. కానీ రసాయనికంగా పండించిన మామిడి పండ్లు పూర్తిగా పసుపు రంగులో, ఏకరీతి రంగులో కనిపిస్తాయి. ఇది అసాధారణం.
Also Read: ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా ? జాగ్రత్త పడకపోతే.. ప్రాణాలకే ప్రమాదం
కోసినప్పుడు లోపలి భాగం:
రసాయనాలను ఉపయోగించి పండించిన మామిడి పండ్లు కొన్నిసార్లు బయటి నుండి పండినట్లు కనిపిస్తాయి. కానీ కోసినప్పుడు లోపల తెల్లగా లేదా పచ్చిగా ఉంటాయి. వాటి రుచి కూడా చప్పగా లేదా కొద్దిగా ఘాటుగా ఉంటుంది. నిజంగా పండిన మామిడి పండ్లు మాత్రం పూర్తిగా పసుపు రంగులో.. జ్యూసీగా , లోపలి నుండి మంచి సువాసనను కలిగి ఉంటాయి.