Blind Spot Trailer: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన నవీన్ చంద్ర ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించారు. అయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే హీరో పాత్రను మాత్రమే కాకుండా నెగెటివ్ షెడ్స్ లోను నటించి మెప్పిస్తున్నారు. తాజాగా నవీన్ చంద్ర హీరోగా రాకేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్లైండ్ స్పాట్. ఈ సినిమాని సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. రామకృష్ణ వీరపనేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్..
ట్రైలర్ తో ఫ్యూజులు అవుట్..
టాలెంట్ స్టార్ నవీన్ చంద్ర, హీరోగా వస్తున్న థ్రిల్లర్ మూవీ బ్లైండ్ స్పాట్. ఈ సినిమా లో రవిశంకర్, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక, హర్ష రోషన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో.. బాగా వాన పడుతున్న టైంలో ఒక పాపను గాయత్రీ తీసుకొని పాప ఏడుస్తుంది అని లోపలికి వెళ్ళగా.. అప్పటికే ఒక మహిళా అక్కడ ఉరివేసుకొని చనిపోయి ఉంటుంది. పోలీస్ నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చి, ఈమె ఉరి వేసుకొని చనిపోలేదు. మర్డర్ చేశారు అని చెప్తాడు. అక్కడ పనిచేస్తున్న గాయత్రిని నీ పేరేమిటి అని అడుగుతాడు. ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు మొదటినుంచి అనిపిస్తుంది. తర్వాత అర్థమైంది. ఇక్కడ ఎవరో పూర్తిగా అబద్ధం చెపుతున్నారు. ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో వాళ్లే మర్డర్ చేశారు. అని చివరిలో కానిస్టేబుల్ తో మర్డర్ చేసింది ఎవరో తెలిసిపోయింది అని హీరో అనడంతో, ట్రైలర్ ముగుస్తుంది. ఈ ట్రైలర్ లో మీరు చూసేది ప్రతిదీ ఒక కోణం నుండే చూస్తారు. మరో కోణం వైపు చూస్తే ఎలా ఉంటుంది అనేదే సినిమా టాగ్ లైన్. కథలో అనూహ్యమైన మలుపులు ఉన్నట్లు ట్రైలర్ ద్వార తెలుస్తుంది.
నెగిటివ్ పాత్రలకు ..
ఇక నవీన్ చంద్ర సినిమా పరంగా నెగిటివ్ పాత్రలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. నాచురల్ స్టార్ నానితో నేను లోకల్ అనే సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేతలో నటించి మెప్పించారు. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజెర్ సినిమాలోని నెగిటివ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించి మెప్పించారు. ఇప్పుడు సోలో హీరోగా థ్రిల్లర్ మూవీ తో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో రవిశంకర్ నటిస్తున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.ఈ సినిమా నవీన్ చంద్రకు సూపర్ సక్సెస్ అందించాలని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలని మనము కోరుకుందాం.
Karan Johar: నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే.. మీరు ఫాలో అవ్వండన్నా కరణ్ జోహార్