Healthy Hair Tips: చలికాలంలో రాగానే చల్లని గాలితో పాటు పొడి వాతావరణం కారణంగా జుట్టు మెరుపును కోల్పోతుంది. అంతే కాకుండా వింటర్ లో జుట్టు నిర్జీవంగా మారుతుందిజ జుట్టు రాలిపోవడం కూడా చాలా వరకు పెరుగుతుంది.మీ జుట్టును మళ్లీ ఆరోగ్యంగా , మెరిసేలా చేయాలనుకుంటే ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి వాటిని మళ్లీ మృదువుగా , మెరిసేలా చేసుకోవచ్చు. ఈ శీతాకాలంలో మీ జుట్టును మృదువుగా, మెరిసేలా ఉంచే ఈ 6 బెస్ట్ హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉల్లిపాయ రసం:
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం చాలా మేలు చేస్తుంది. ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు యొక్క మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలను బట్టి తాజా ఉల్లిపాయల రసాన్ని తీసి తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.
2. పిప్పరమింట్ ఆయిల్:
స్కాల్ప్ కోసం పెప్పర్ మింట్ ఆయిల్ మించినది మరొకటి ఉండదు. ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీని కారణంగా జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది. కొబ్బరినూనెలో ఒక చెంచా పెప్పర్‌మెంట్ ఆయిల్‌ను మిక్స్ చేసి తలకు మృదువుగా మర్దన చేసి గంట తర్వాత కడిగేయాలి.
3. రోజ్మేరీ ఆయిల్:
రోజ్మేరీ ఆయిల్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది తలకు పోషణనిచ్చి వెంట్రుకలను ఒత్తుగా మారుస్తుంది. మీరు దీన్ని ఏదైనా క్యారియర్ ఆయిల్‌లో(కొబ్బరి లేదా బాదం నూనె వంటివి) కలిపి ద్వారా కూడా ఉపయోగించవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఇలా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా బాగా పెరుగుతుంది కూడా.
4. అలోవెరా:
కలబంద జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్. ఇది దురద, చుండ్రు ,స్కాల్ప్ పొడి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తాజా కలబందను తగినంత తీసుకోండి. దాని జెల్‌ని తీసి జుట్టుకు పట్టించి 20-30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేయండి.
5. మెంతి గింజలు:
మెంతి గింజల్లో ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు యొక్క బలంగా మారడానికి ఇవి ఉపయోగపడతాయి. రాత్రంతా నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి 25-30 నిమిషాల తర్వాత కడగాలి. ఇది జుట్టుకు బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
Also Read: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. ఇది ఒక్క సారి వాడండి చాలు
6. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు ఉపయోగపడే నూనెలలో ఒకటి. ఇది లోతుగా జుట్టుకు పోషణను ఇస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెను తీసుకుని తలపై సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం తేలికపాటి షాంపూతో వాష్ చేయండి.
హోం రెమెడీస్ వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది కూడా. జుట్టు ఒత్తుగా పెరగాంటే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం అలవాటు చేసుకోవాలి.