BigTV English

OTT Movie : ఈ కుక్క తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… మనుషులను ఎలా కాపాడింది అంటే…

OTT Movie : ఈ కుక్క తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే… మనుషులను ఎలా  కాపాడింది అంటే…

OTT Movie : హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలకి ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమాలు మూవీ లవర్స్ ను  బాగా ఎంటర్టైన్ చేస్తాయి. చిన్న పిల్లలు కూడా ఈ సినిమాలను అల్లరి చేయకుండా సైలెంట్ గా చూస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హీరో పాత్రలో ఒక డాగ్  ఉంటుంది. మనిషి జంతువునుంచి వచ్చినా, ఈ కుక్కని చూసి నేర్చుకోవలసింది చాలా వుంది. ఈ సినిమా మొత్తం ఒక డాగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


డిస్నీ + హాట్ స్టార్ (Disney + Hotstar) లో

ఈ హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ పేరు ‘ది కాల్ ఆఫ్ ది వైల్డ్‘ (The Call of the wild). ఈ మూవీకి క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో  హారిసన్ ఫోర్డ్, ఒమర్ సై, కారా గీ, డాన్ స్టీవెన్స్, కరెన్ గిల్లాన్, బ్రాడ్లీ నటించారు. 1890లో ఒక కుక్కను కాలిఫోర్నియాలోని తన ఇంటి నుండి దొంగిలించి, యుకాన్‌ అనే ప్రాంతానికి పంపుతారు. అక్కడ ఆ కుక్క తన జీవితాన్ని మార్చే సాహసం చేస్తుంది. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో ఫిబ్రవరి 21, 2020న 20వ సెంచరీ స్టూడియోస్ ద్వారా విడుదల చేయబడింది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney + Hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

18వ శతాబ్దం చివరి దశలో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఒక సంపన్న కుటుంబంలో బక్ అనే డాగ్ అల్లారుముద్దుగా పెరుగుతుంది. అయితే ఒక రోజు అ ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే, అక్కడ ఏర్పాటుచేసిన డిన్నర్ ని బక్ పాడు చేస్తుంది. ఇంటి యజమాని బక్ కి, ఒకరోజు ఇంట్లోకి రానివ్వకుండా పనిష్మెంట్ ఇస్తాడు. ఈ క్రమంలో బక్ ని ఒక దొంగ ఎత్తుకుపోయి, ఒక డీలర్ కి అమ్మేస్తాడు. ఆ డీలర్ నుంచి బెల్లోర్ట్ అనే వ్యక్తి బక్ ని  కొనుగోలు చేస్తాడు. అతడు 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అలస్కా లో ఉత్తరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పని మీద గానే కొన్ని కుక్కలను తీసుకొని, బెల్లోర్ట్ వాటి మీదుగా అలస్కా ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. ఈ సమయంలో బక్ కి జాన్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంతలోనే బెల్లోర్ట్ తన లగేజీతో డాగ్స్ అన్నిటిని కలిపి రైడ్ చేస్తూ, అలాస్కాకి ప్రయాణం మొదలుపెడతాడు.

బక్ మిగతా కుక్కలకి ఈ ప్రయాణంలో లీడర్ గా మారుతుంది. ఈ ప్రయాణంలో బక్ యజమానికి కూడా చాలా సహాయం చేస్తుంది. ఆ తర్వాత టెక్నాలజీ మారడంతో, డాగ్స్ తో డెలివరీ చేసే ఉద్యోగాన్ని విరమించుకోవాల్సి వస్తుంది బెల్లోర్ట్. తప్పని పరిస్థితుల్లో ఆ కుక్కలను, వేరొకరికి విక్రయించి వెళ్ళిపోతాడు బెల్లోర్ట్. ఆ తర్వాత ఒక క్రూరమైన వ్యక్తి బక్ ని కొంటాడు. అయితే అతడు పెట్టిన లగేజ్ లాగలేక కళ్ళు తిరిగి పడిపోతుంది బక్. అతని నుంచి బక్ ని జాన్ కాపాడతాడు. ముసలివాడైన జాన్ కు సాయపడుతూ ఉంటుంది బక్. చివరికి బక్ తన సొంత యజమాని ఇంటికి చేరుకుంటుందా? అడవిలోనే తన జీవితాన్ని గడుపుతుందా? ఆ కుక్కనుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×