BigTV English

OTT Movie : ట్రాన్స్ జెండర్ తో లవ్ లో పడే డెలివరీ బాయ్… ఇంట్లో వాళ్లకి విషయం తెలిసి ఏం చేశారంటే…

OTT Movie : ట్రాన్స్ జెండర్ తో లవ్ లో పడే డెలివరీ బాయ్… ఇంట్లో వాళ్లకి విషయం తెలిసి ఏం చేశారంటే…

OTT Movie : ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి అడ్డాగా మారింది. ఇందులో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిని చూస్తూ మూవీ లవర్స్ కూడా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. రకరకాల కంటెంట్ లతో వచ్చే సినిమాలలో, కొన్ని సినిమాలు మనసుకి బాగా హత్తుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అటువంటిదే. హీరో ఒక ట్రాన్స్ జెండర్ ని లవ్ చేస్తాడు. వీళ్ళిద్దరి ప్రేమ ఎంతవరకు వెళ్తుందో స్టోరీ లోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


రెండు ఓటిటిలలో

ఈ బెంగాల్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘నాగర్‌కీర్తన్‘ (Nagarkirtan). 2019 లో వచ్చిన ఈ బెంగాలీ మూవీకి కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించారు. ఈ  మూవీలో రిద్ధి సేన్ గ్రామీణ బెంగాల్‌కు చెందిన పరిమళ్ అనే ట్రాన్స్ మహిళగా, మధు అనే ఫ్లూట్ ప్లేయర్‌గా రిత్విక్ చక్రవర్తి నటించారు.
ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ హియోచి (Hoichoi), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మధు ఫుడ్ డెలివరీ బాయ్ గా జాబ్ చేస్తుంటాడు. ఇతడు ఫ్లూట్ కూడా బాగా వాయిస్తూ ఉండటంతో, పార్ట్ టైం జాబ్ గా ఫ్లూట్ ని నేర్పిస్తుంటాడు. ఒకరోజు ఇతనికి పరిచయం ఉన్న ఒక ముసలాయనకి ఆరోగ్యం బాగో లేకపోవడంతో, మధు అతన్ని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ ఇంటికి పక్కనే ఉన్న పరిమళ్ అనే ట్రాన్స్ జెండర్, మధుకి పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమలో పడతారు. అయితే మధుతో ప్రేమలో పడ్డ పరిమళ్ కు, ఆమె లీడర్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఎవరికీ చెప్పకుండా తను మధు దగ్గరికి వెళ్ళిపోతుంది. పరిమళ్ ని అమ్మాయిగా మార్చడానికి,  ఆపరేషన్ చేయించాలని డాక్టర్ని కూడా కలుస్తాడు మధు. దానికి చాలా డబ్బు ఖర్చవుతుందని ఆ డాక్టర్ చెప్తాడు. ఈ క్రమంలో పరిమళ్ ని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్తాడు మధు. అయితే ఇంట్లో వాళ్ళు తనని మొదట అమ్మాయి అని అనుకుంటారు. ఒకానొక టైంలో పరిమళ్ అమ్మాయి కాదని తెలుసుకుంటారు.

ఇంట్లో వాళ్ళు కోపం పెంచుకొని మధుని బయటికి వెళ్ళగొడతారు. ఈ విషయం తెలిసి పరిమళ్ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. డబ్బులు లేక అడుక్కుంటూ ఉండటంతో, మరి కొంతమంది ట్రాన్స్ జెండర్లు ఆమెను గట్టిగా కొడతారు. పోలీసులు వచ్చి తనని స్టేషన్ కి తీసుకువెళ్తారు. ఆ తరువాత తను ఎక్కడుందో కనుక్కొని మధు వస్తాడు. ఈ లోగా పరిమళ్ ఉరి వేసుకుని చనిపోతుంది. మధు పరిమళ్ కాళ్లు పట్టుకొని ఏడుస్తూ, పరిమళ్ బట్టలు వేసుకుని ట్రాన్స్ జెండర్ లీడర్ దగ్గరికి వెళ్తాడు. చివరికి మధు ఏమవుతాడు? ఆ లీడర్ ట్రాన్స్ జెండర్ ని ఎలా వాడుకుంటుంది? మధు ఆ లీడర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘నాగర్‌కీర్తన్’ (Nagarkirtan) అనే లవ్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

SU from SO OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×