BigTV English

Aloe Vera Hair Mask: కలబంద హెయిర్ సీరమ్‌తో కురుల సిరులను పెంచుకోండి!

Aloe Vera Hair Mask: కలబంద హెయిర్ సీరమ్‌తో కురుల సిరులను పెంచుకోండి!

Aloe Vera Hair Mask: జుట్టుకు సంబంధించి సమస్యలు అన్ని కావు. తరుచూ విపరీతంగా ఊడిపోవడం. చుండ్రు రాలడం. ఇవి ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, పోషకాహారం తినకపోవడం, బయట కాలుష్యం ఇతర కారణాలు కావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆగోర్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే.. జుట్టు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు బయట మార్కెట్లో అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల ఫలితం ఉండకపోవచ్చు.


ఇలాంటి అనేక రకాల జుట్టుకు సంబంధించి ఒకే ఒక్క హెయిర్ స్పెషలిస్ట్ ఉంది. అదేనండి కలబంద.. వీటిని ఉపయోగించి చిన్నపెద్ద సమస్యలన్నింటిని పరిష్కరించుకోవచ్చు. కొన్నిసార్లు సాధారణ షాంపులు జుట్టుకు హాని కలిగించవచ్చు. కాబట్టి తలస్నానం చేసేటప్పుడు షాంపులో కొంచెం కలబంద గుజ్జును కలపండి. షాంపూలోని రసాయనాలను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
సాధారణంగా జుట్టు కుదుళ్ల నుంచి అదనపు నూనెలు బయటకు వస్తుంటాయి.

ఇవి ఒకరకమైన అమైనోఆసిడ్స్. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటి అమినో ఆసిడ్స్ కలబందలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే కలబందను తరుచూ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు, సిల్కీగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి కలబందలో ఈ పదార్ధాలను కలిపి హెయిర్ సీరమ్ తయారు చేసుకున్నారంటే.. ఊడిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. చాలా అందంగా తయారవుతుంది.


కావాల్సిన పదార్ధాలు
కలబంద
వేపాకు
వెల్లుల్లిపాయలు
కొబ్బరి నూనె

Also Read: మందార పువ్వుతో ఈ హెయిర్ సీరమ్ ట్రై చేసారంటే.. ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది..

కలబందతో హెయిర్ సీరమ్ తయారు చేసుకునే విధానం..
ముందుగా తాజా కలబందను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ గుజ్జును స్టవ్ మీద కాసేపు మరిగించాలి. ఆ తర్వాత అందులో ఐదు టీస్పూన్‌ల కొబ్బరి నూనె వేసి, గుప్పెడు వెల్లుల్లిపాయలు , 20 వేపాకులు వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి, బాగా చల్లారిన తర్వాత.. చిన్న సీసాలో వడకట్టి నిల్వ ఉంచుకోండి. అంతే సింపుల్.. కలబందతో హెయిర్ సీరమ్ రెడీ అయినట్లే.. దీన్ని ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు చాలా మంచిది. ఇందులో ఉపయోగించే పదార్ధాలన్ని జుట్టు సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. కురులు ఒత్తుగా పెరుగుతాయి.

కలబంద, ఉల్లిపాయ హెయిర్ సీరమ్

ముందుగా కలబందను, ఉల్లిపాయలను తీసుకుని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. సరిపడినంత కొబ్బరి నూనెలో ఉల్లిపాయ ముక్కలు, కలబంద ముక్కలు వేసి అందులో చిటికెడు అల్లం వేసి స్టవ్ మీద బాగా మరిగించాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకు అప్లై చేయొచ్చు. కురులు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×