BigTV English

Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

Chintamaneni Angry: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు క్రమంగా మొదలవు తున్నాయా? కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు కొట్టుకుంటున్నారా? కొత్తగా చేరినవారు గొడవలకు దిగుతున్నారా? లేక పాత కార్యకర్యలా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి.


కొద్దిరోజులుగా దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య జరుగుతున్న విభేదాలపై నోరు విప్పారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కొన్ని అరాచక శక్తులు ఇటీవల జనసేనలో చేరాయని, పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారన్నది ఆయన వెర్షన్.

చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిదేనని, పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటని ప్రశ్నించారు. గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని, ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది వీళ్లేనన్నది అంటున్నారు.


పార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదని, ఈ వ్యవహారంపై జనసేన అధినాయకత్వంతో తేల్చుకుంటానని చెప్పుకొచ్చారు. పైడి చింతలపాడులో జరిగిన ఘటనను పవన్ దృష్టికి తీసుకెళ్తానంటూ ఓ ఛానెల్‌తో చెప్పుకొచ్చారు.

ALSO READ: ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది. స్థానిక సర్పంచ్ వర్గానికి చెందిన టీడీపీ నేతలను పిలవకుండానే పెన్షన్లు పంపిణీ సైలెంట్‌గా జరిగిపోయింది.

ఈ వ్యవహారం టీడీపీ-జనసేన మధ్య వివాదం మొదలైంది.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి.

దీనిపై వివరాలు సేకరించిన ఎమ్మెల్యే చింతమనేని, టీడీపీ కార్యకర్తలపై గొడవకు దిగింది జనసేన కార్యకర్తలు కాదని, ఇటీవల కొందరు ఆ పార్టీలోకి వచ్చినవారని తేలింది. దీనిపై ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలో తన బాధను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×