BigTV English

Delhi Diwali Violence: కాళ్లు మొక్కి మరీ కాల్చేశాడు.. ఢిల్లీలో దిపావళి రోజు దారుణం, ఇద్దరు మృతి

Delhi Diwali Violence: కాళ్లు మొక్కి మరీ కాల్చేశాడు.. ఢిల్లీలో దిపావళి రోజు దారుణం, ఇద్దరు మృతి

Delhi Diwali Violence| దీపావళి పండుగ జరుపుకుంటున్న ఒక కుటుంబంపై ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. ఒక పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు 16 ఏళ్ల టీనేజర్ దుండగుడు పారిపోతుండగా అతడిని పట్టుకోబోయాడు.. దీంతో ఆ దుండగడు టీనేజర్‌ను కూడా కాల్చి చంపాడు. ఈ హింసాత్మక ఘటన రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒక సీసీటీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని బిహారి కాలనీలో ఆకాశ్ శర్మ్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన కొడుకు రోహన్ (10), మేనల్లుడు రిషబ్ (16) తమ ఇంటి బయట రాత్రి 8 గంటలకు దీపావళి టపాసులు కాలుస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1.35 నిమిషాల వీడియోలో ముగ్గురు కూడా ఒకేరకమైన పసుపు కలర్ లో కొత్త బట్టలు వేసుకొని సంబరాలు చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?


ముగ్గురూ టపాసులు కాలుస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. ఒక వ్యక్తి ఆకాశ్ శర్మకు నమస్కారం చేసి కాళ్లు మొక్కాడు. బైక్ పై వెనుకాల కూర్చొన్న వ్యక్తి ఆకాశ్ శర్మ వైపు సీరియస్ చూస్తూ ఉన్నాడు. అది గమనించిన ఆకాశ్ శర్మ వెంటనే తన కొడుకు రోహన్ ని తీసుకొని వెంటనే ఇంటి లోపలివైపు పరుగులు తీశాడు.

బైక్ పై వచ్చిన ఆ రెండో వ్యక్తి ఇది చూసి.. తన వద్ద ఉన్న తుపాకీ బయటకు తీసి వారిని వెంబడిస్తూ.. ఇంట్లోకి దూరి వారిద్దిరపై కాల్పులు జరిపాడు. మొత్తం నాలుగు రౌండ్లు తండ్రీ కొడుకలపై కాల్చాడు. ఆ తరువాత వెంటనే బయట ఉన్న వ్యక్తి స్కూటీని ముందుకు పోనిచ్చాడు. రెండో వ్యక్తి ఇంటి బయటకు వచ్చి స్కూటీపై వెళుతుండగా.. ఇదంతా ఇంటి బయట నిలబడి గమనించిన ఆకాశ్ శర్మ్ మేనల్లుడు రిషబ్.. స్కూటీపై వెళుతున్న ఇద్దరు దుండగులను పట్టుకునేందుకు పరుగులు తీశాడు.

స్కూటీ వెనుక కూర్చొన్న వ్యక్తి కాలర్ ను రిషబ్ పట్టుకున్నాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీ తీసి రిషబ్ గొంతులో బుల్లెట్ దింపాడు. రిషబ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆకాశ్ శర్మ కొడుకు రోహన్ బతికే ఉన్నాడని గమనించి అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

ఢిల్లీ షాహ్దారా డిప్యూటీ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం రాత్రి 8.30 గంటలకు ఫర్ష బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగినట్లు ఫోన్ వచ్చింది. ఈ కాల్పుల ఘటనలో దుండగులు మొత్తం 5 రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. ఘటనలో ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. వీరిలో ఆకాశ్ శర్మ (40), రిషభ్ (16) చనిపోగా.. రోహన్ (10) బుల్లెట్ గాయాల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ దాడి గురించి కుటుంబ కక్షలు, ఆస్తి లేదా వ్యాపార గొడవల కారణంగా జరిగిందనే అనుమానాల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. దాడి చేసిన ఇద్దరు దుండగులలో ఒకరు మైనర్. ఆ మైనర్ ని పోలీసులు పట్టుకున్నారు. రెండో వ్యక్తిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఢిలీ పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×