Sapota Benefits: సపోటాలో అనేక పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. అందుకే వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సపోటాలో సహజ చక్కెరలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. తక్షణ శక్తిని అందించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సపోటా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది:
సపోటాలో ఉండే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించి పేగులను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా కడుపును కూడా చల్లబరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తక్షణ శక్తిని అందిస్తుంది:
సపోటాలో గ్లూకోజ్ సహజంగానే లభిస్తుంది. ఇది అలసట లేదా బలహీనతను తగ్గిస్తుంది. అంతే కాకుండా తక్షణ శక్తిని అందించడానికి పనిచేస్తుంది. వ్యాయామం చేసేవారికి లేదా తరచుగా అలసిపోయే సపోటా వారికి మంచి ఫ్రూట్ అని చెప్పవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
సపోటాలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు తరచుగా సపోటా తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
ఎముకలను బలపరుస్తుంది:
సపోటాలో కాల్షియం, భాస్వరం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది . అంతే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల బారి నుండి నివారిస్తుంది.
చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది:
సపోటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ ఇ చర్మాన్ని తేమగా మార్చి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిచేస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది.
ఒత్తిడి, నిద్రలేమిని తగ్గించడం:
సపోటాలో సహజమైన మత్తు లక్షణాలు ఉన్నాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో , నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అది మనసును ప్రశాంతంగా ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: బ్లాక్ హెడ్స్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే.. ట్రై చేస్తే మంచి రిజల్ట్
సపోటాను ఎవరు తినకూడదు ?
మధుమేహ రోగులు సపోటాకు దూరంగా ఉండటం చాలా మంచిది. సపోటాలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి.
బరువు తగ్గాలనుకునేవారు:
సపోటాలో కేలరీలు , కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారు సపోటా తినకుండా ఉండటం బెటర్.
పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.