Blackheads: ప్రతి ఒక్కరూ అందమైన చర్మాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మ సంబంధిత సమస్యలు నిరంతరం పెరుగుతుంటాయి. చర్మం నిరంతరం దుమ్ము, ధూళి , కాలుష్యానికి గురైతే, అది అనేక రకాల చర్మ సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల ముఖంపై వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అలాగే, రంధ్రాలలో మురికి పేరుకుపోవడం కూడా జరుగుతుంది. వీటి వల్ల.. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత కూడా మురికిగానే కనిపిస్తుంది.
ముఖం మీద బ్లాక్ హెడ్స్ పేరుకుపోతే ముఖంలోని మెరుపు కూడా మాయమవుతుంది. దీని కోసం.. చాలా మంది పార్లర్లకు వెళ్లి ఖరీదైన ఫేషియల్స్, కెమికల్ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. కానీ దీని తర్వాత కూడా, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ పూర్తిగా తొలగిపోవు. మీరు కూడా బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతున్నారా ? అవును అయితే.. ఇప్పుడు మీరు వీటిని తొలగించడం కోసం పార్లర్‌కు వెళ్లవలసిన అవసరం అస్సలు లేదు. నిమ్మకాయ, ఉప్పుతో ఇంట్లోనే మీ బ్లాక్ హెడ్స్‌ను క్లియర్ చేసుకోవచ్చు.
బ్లాక్ హెడ్స్ ఎలా తొలగించాలి ?
కావలసినవి:
నిమ్మకాయ
ఉప్పు
ఎలా వాడాలి ?
బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి.. ముందుగా మీరు నిమ్మకాయను తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయను మధ్యలో నుండి సగానికి కట్ చేయండి. ఇప్పుడు నిమ్మకాయ మీద రెండు చిటికెడు ఉప్పు వేసి బాగా రుద్దండి. అనంతరం దీనిని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశాలలో సున్నితంగా రుద్దండి. కాసేపు అలాగే ఉంచండి. అనంతరం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి.
ప్రయోజనాలు:
ఉప్పు స్క్రబ్ లా పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. అంతే కాకుండా ఇది చనిపోయిన చర్మాన్ని శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. అదే సమయంలో.. నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
అలోవెరా జెల్‌తో బ్లాక్ హెడ్స్ క్లియర్ :
మీకు కావాలంటే.. కలబంద జెల్ సహాయంతో ఇంట్లోనే మీ బ్లాక్ హెడ్స్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. దీని కోసం.. మీరు తాజా కలబంద జెల్ తీసుకోండి. దీనిని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత.. కాసేపు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.
కలబంద జెల్ ను రాత్రంతా ముఖం మీద ఉంచి ఉదయం నిద్రలేచిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఒక వారం పాటు నిరంతరం చేయండి. ఇది బ్లాక్ హెడ్స్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
Also Read: ఇవి వాడితే.. తలమోయలేనంత జుట్టు
పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: 7 రోజుల్లోనే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే ? ఈ ఆయుర్వేద చిట్కా ట్రై చేయండి