BigTV English

White Hair Remove: చిటికెలో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి ఇలా..!

White Hair Remove: చిటికెలో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి ఇలా..!

White Hair Remove: ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తైన కురులు, నల్లగా నిగనిగలాడుతూ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే కురులు అందరికి ఒకేలా ఉండకపోవచ్చు. కానీ ఈరోజుల్లో చాలా మందికి నిండా ముప్పై ఏళ్లు నిండకుండానే తెల్లజుట్టుతో ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం వల్ల కానీ, దుమ్మూ, ధూళి, కాలుష్యం, జన్యులోపం కారణంగా తెల్లజుట్టు రావడం సాధారణంగా మారింది. వైట్ హెయిర్ వల్ల బయట తిరగాలన్నా చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ వంటివి ఉపయోగిస్తుంటారు. ఇవి వారం, పది రోజులు మాత్రమే పనిచేస్తాయి. తర్వాత మళ్లీ యథావిధిగా జుట్టు తెల్లగా వచ్చేస్తుంటుంది.


ఈ ఉరుకు పరుగుల జీవితంలో వారం వారం హెయిర్ కేర్ చేయడం కష్టమే.. పైగా వీటిలో కెమికల్స్ ఉంటాయి. దీంతో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోవాలంటే.. మన ఇంట్లోనే కొన్ని హెయిర్ మాస్క్‌లు తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ కలర్స్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

☀ కావాల్సిన పదార్ధాలు
⦿ ఆవాలు


⦿ కరివేపాకు

⦿ కొబ్బరినూనె

⦿ మెంతులు

☀ తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి బాగా నల్లగా వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి మిక్స్ చేసి, తలకు అప్లై చేయండి. గంట తర్వాత తలస్నానం చేయండి.. ఈ పొడి కొద్ది రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే చాలు శాశ్వతంగా తెల్లజుట్టు సమస్యలు తొలగిపోతాయి. జుట్టు కూడా పొడువుగా, చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలు.. ముఖ్యంగా ఆవాల్లో జుట్టు నల్లగా మార్చే సహజ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఉపయోగించవచ్చు.

జుట్టు నల్లగా మార్చేందుకు ఆవ నూనె కూడా చక్కగా పనిచేస్తుంది. జుట్టును సహజంగా ఉంచడంలో, ఒత్తుగా పెరిగేందుకు, చుండ్రు సమస్యలు తగ్గించడంలో కూడా అధ్బుతంగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండే ఆవ నూనెను జుట్టుకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆవనూనెలో ఈ పదార్ధాలను కలిపి ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

☀ కావాల్సిన పదార్ధాలు
⦿ ఆవ నూనె

⦿ కరివేపాకు

⦿ గోరింటాకు పొడి

☀ తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి.. కడాయి పెట్టుకుని అందులో ఆవనూనె, కరివేపాకు వేసి వేడి చేయాలి. అందులో గోరింటాకు పొడి వేసి కొద్దిసేపు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేసి, 40 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు, మూడు సార్లు చేస్తే.. తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరగడంతో పాటు, చుండ్రు కూడా తొలగిపోతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×