Tollywood:రామ్ చరణ్(Ram Charan) చేతిలో ప్రస్తుతం 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) డైరెక్షన్లో రాబోయే RC16.. మరొకటి సుకుమార్ (Sukumar )డైరెక్షన్లో రాబోయే RC17. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ( Game Changer) భారీ డిజాస్టర్ అయ్యి, నిర్మాతలకు నష్టాలు తెచ్చి పెట్టింది. దాంతో రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్టు కొట్టాలి అని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. RC16 మూవీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతోనే రామ్ చరణ్,సుకుమార్ (Sukumar) తో RC17 సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా పైనే అభిమానులకు ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఒక అప్డేట్ వచ్చింది.అదేంటంటే RC17 సినిమా కోసం రామ్ చరణ్ , సుకుమార్ కత్తిలాంటి హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ RC 17 లో నటించబోయే ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Anushka Shetty: అనుష్క నటించిన సీరియల్ ఏంటో తెలుసా.. అందులో ఎవరెవరున్నారంటే..?
RC 17 లో ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న..
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటికే ‘రంగస్థలం’ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. వీరి కాంబోలో నెక్స్ట్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఏ లెవెల్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా ఉంటుందని ఇప్పటికే హింట్స్ ఇచ్చేస్తున్నారు. అయితే తాజాగా చెర్రీ సుక్కు కాంబోలో రాబోయే సినిమా కోసం వరుస హిట్స్ తో జోరు మీదున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna) ని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఓ రూమర్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే వరుస హిట్స్ తో రష్మిక మందన్నా తన జోరు కనబరుస్తోంది. అందుకే ఈ హీరోయిన్ ని తన సినిమాలో పెట్టుకుంటే సినిమాకి మరింత ప్లస్ అవుతుందని సుకుమార్ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రాంచరణ్ – రష్మిక కాంబోలో ఇప్పటి వరకు సినిమా రాలేదు. వీరి కాంబోలో సినిమా తీయాలని సుక్కు అనుకోవడంతో రాంచరణ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ..
ఇక చెర్రీ సుక్కు కాంబోలో రాబోయే సినిమా యాక్షన్ ప్యాక్డ్ జానర్లో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లాగే డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారని, అలా ఓ పాత్రలో నటించే చెర్రీకి జోడిగా రష్మికని ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో సినిమాకి దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. మరి సుకుమార్ ఈ కాంబోతో ఎలాంటి సక్సెస్ను అందిస్తారో చూడాలి.