BigTV English

Pencap Removed Lungs 21 Years : పెన్ క్యాప్ మింగేసిన 5 ఏళ్ల బాలుడు.. 21 ఏళ్ల తరువాత ఆపరేషన్ చేస్తే..

Pencap Removed Lungs 21 Years : పెన్ క్యాప్ మింగేసిన 5 ఏళ్ల బాలుడు.. 21 ఏళ్ల తరువాత ఆపరేషన్ చేస్తే..

Pencap Removed Lungs 21 Years | ఒక అయిదేళ్ల బాలుడు ఆడుకుంటూ ఒక పెన్ క్యాప్ మింగేశాడు. అయితే ఆ సమయంలో అతనికి పెద్దగా ఆరోగ్య సమస్యలు ఎదురు కాలేదు. కానీ 21 ఏళ్ల తరువాత ఆ బాలుడు కాస్త యువకుడయ్యాడు. ఇటీవల అతని విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆస్పత్రికి వెళితే.. వైద్య పరీక్షలు చేసి ఊపిరితిత్తుల్లో ఏదో పెద్ద ఇన్‌ఫెక్షన్ అయిందని చెప్పి ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే ఆపరేషన్ మధ్యలోనే వైద్యులు ఊపిరితిత్తుల్లో గట్ట కట్టిన ఇన్‌ఫెక్షన్ తొలగించే క్రమంలో ఏదో ఉందని చూసి నిర్ఘాంతపోయారు. ఈ అనుభవం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లకు ఎదురైంది.


వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు. అతనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పెన్ క్యాప్ మింగేశాడు. గత నెల రోజుల నుంచి దగ్గు రావడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలతో అతను బాధపడుతున్నాడు. పది రోజులుగా దగ్గు విపరీతంగా పెరిగిపోయి, నిద్రపోవడానికి కూడా వీలు కాకపోవడంతో వైద్యులను సంప్రదించాడు. అప్పుడు సీటీ స్కాన్ చేయించగా, ఎడమవైపు ఊపిరితిత్తుల కింది భాగంలో భారీగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిసింది. దాంతో అతడిని కరీంనగర్ వైద్యులు హైదరాబాద్‌కు పంపారు.

హైదరాబాద్ లోని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ చేశాక.. అతనికి కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ నాదెళ్ల చికిత్స చేశారు. అయితే ఈ కేసు చాలా ఆసక్తికరంగా ఉండడంతో మీడియా దృష్టికి వచ్చింది.


Also Read:  లీటర్ పాలు రూ.180.. నెయ్యి కిలో రూ.4000.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూపర్ బిజినెస్

డాక్టర్ శుభకర్ నాదెళ్ల మాట్లాడుతూ.. “ఆ యువకుడు ఇక్కడకు వచ్చినప్పుడు ముందుగా సీటీ స్కాన్ చేశాం. అప్పుడు లోపల ఏదో ఒక గడ్డలా కనిపించింది. ఆ గడ్డ వల్ల ఊపిరితిత్తుల వద్ద ఆటంకం ఏర్పడి, దగ్గు వస్తోందని భావించాం. దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తూ లోపల చూసేసరికి ఏదో వస్తువు లాంటిది కనిపించింది. అప్పటికే ఆపరేషన్ ప్రారంభించి మూడు గంటలు గడిచింది.. ప్రొసీజర్ మధ్యలోనే ఆ యువకుడి సోదరుడిని ఆపరేషన్ థియేటర్ లోపలకు పిలిచి, గతంలో ఏమైనా మింగాడా? అని అడిగాం. అప్పుడు, అతను ఐదేళ్ల వయసులో ఉండగా పెన్ క్యాప్ మింగేశాడని.. ఆ వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, అక్కడ పరీక్షించి లోపల ఏమీ లేదని, బహుశా మలంతో పాటు వెళ్లిపోయి ఉండొచ్చని చెప్పారని తెలిపాడు. ఇది విన్నాక అది పెన్ క్యాప్ అని నిర్ధారణ చేసుకున్నాం. దాన్ని జాగ్రత్తగా తొలగించేశాం.

దాదాపు మూడు గంటల పాటు కష్టపడి, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ సాయంతో ముందుగా దాని చుట్టూ పేరుకుపోయిన కణజాలాలు, లింఫ్‌నోడ్, కండలను కొద్దికొద్దిగా తొలగించాం. క్రమంగా అదంతా క్లియర్ అయిన తర్వాత, ఆ పెన్ క్యాప్‌ను బయటకు తీసేశాం. ఇన్ని సంవత్సరాల పాటు అలా ఒక ఫారిన్ బాడీ లోపల ఉండిపోవడం వల్ల ఊపిరితిత్తులు కూడా కొంత దెబ్బతిన్నాయి. అయితే దెబ్బతిన్న ఊపిరితిత్తుల భాగాలను సరిచేసేందుకు యాంటీబయాటిక్స్ చికిత్స ఇచ్చాం. దాంతో అతను కోలుకున్నాడు. పెన్ క్యాప్ లేదా ఇతర వస్తువులు అలా ఎక్కువ కాలం ఉండిపోవడం మంచిది కాదు.

బాధితుడు ఈ సమస్య అలాగే వదిలేసి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ చుట్టూ కణజాలం పేరుకుపోతుంది. దాంతో ఆ ఊపిరితిత్తి మొత్తం పాడైపోతుంది. అప్పుడు దాన్ని శస్త్రచికిత్స చేసి పాడైన భాగాన్ని కోసేయాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు ముందే గుర్తించడంతో మందులతోనే దాన్ని సరిచేయగలిగాం. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో.. నోట్లో ఏం పెట్టుకుంటున్నారో జాగ్రత్త వహించాలి. అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లి.. దాన్ని తీయించాలి. లేకపోతే ఇలాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి,” అని డాక్టర్ తెలిపారు.

Related News

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Big Stories

×